మల్లికార్జున్ ఖర్గే : బాల్యం, విద్య, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం, నెట్ వర్త్ & మరిన్ని

By Rajesh Karampoori  |  First Published Mar 8, 2024, 11:23 PM IST

Mallikarjun Kharge Biography: కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు, ఎంతో పేరున్న నాయకుడు. తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా.. రెండుసార్లు ఎంపీగా.. రెండుసార్లు కేంద్రమంత్రిగా చేస్తారాయన. మూడు పర్యాయాలు సీఎం అవకాశాలను కోల్పోయారు. ఆయన  ఏమాత్రం నిరాశ చెందలేదు. పార్టీపై తిరుగుబాటు లేదు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి వరకు ఆయన రాజకీయ ప్రయాణం ఎంతోమందికి ఆదర్శం. అధిష్టానం మేరకు నడుచుకున్న రాజకీయ యోధుడు మల్లికార్జున ఖర్డే. అన్నింటికి మించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మద్దతు ఉండి ప్రారంభం నుంచి గాంధీ కుటుంబానికి విశ్వాస పాత్రుడిగా పని చేస్తున్నారు కర్ణాటక కాంగ్రెస్ నేతల పేర్లు చెప్తే ఆయన పేరు ముందు వినిపిస్తుంది. అలాంటి నాయకుడి జీవిత, రాజకీయ ప్రస్థానం గురించి ఓ సారి లూక్కేద్డాం. 


Mallikarjun Kharge Biography: 

బాల్యం, విద్యాభ్యాసం & కుటుంబం

Latest Videos

మల్లికార్జున్ ఖర్గే పూర్తి పేరు మాపన్న మల్లికార్జున్ ఖర్గే.. ఆయన జులై 21, 1942న కర్ణాటకలోని బీదర్ జిల్లాలోని వరవట్టి దళిత కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి పేరు మాపన్న ఖర్గే, తల్లి పేరు సాయిబావ. మల్లికార్జున్ ఖర్గే తన పాఠశాల విద్యను గుల్బర్గాలోని నూతన్ విద్యాలయంలో పూర్తి చేశాడు. తరువాత అతను గుల్బర్గాలోని ప్రభుత్వ కళాశాల నుండి బ్యాచిలర్ (BA) డిగ్రీ పట్టాపొందారు.ఆ తరువాత.. ఖర్గే గుల్బర్గాలోని సేథ్ శంకర్‌లాల్ లాహోటి లా కాలేజీ నుండి లా (LLB) డిగ్రీని కూడా పొందారు.

తన వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఖర్గే మే 13, 1968న రాధాబాయిని వివాహం చేసుకున్నారు. వీరికి ఐదుగురు పిల్లలు. (ఇద్దరు కూతుళ్లు, ముగ్గురు కొడుకులు). కుమార్తెల పేర్లు- ప్రియదర్శిని, జయశ్రీ. కొడుకుల పేర్లు ప్రియాంక్ ఖర్గే, రాహుల్ ఖర్గే, మిలింద్ ఖర్గే. ఇందులో కుమారుడు ప్రియాంక్ ఖర్గే రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. తన తండ్రిలాగే, అతను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.   కలబురగిలోని చిత్తాపూర్ అసెంబ్లీ స్థానం నుండి తిరిగి ఎన్నికైన తర్వాత కర్ణాటక అసెంబ్లీకి చేరుకున్నారు. కుమారస్వామి ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు.   ఇప్పుడు మల్లికార్జున్ ఖర్గే మతం గురించి మాట్లాడితే.. ఆయన హిందూ మతం నుండి బౌద్ధమతంలోకి మారారు. తాను బౌద్ధమతాన్ని అనుసరిస్తున్నారు.

రాజకీయ జీవితం

ఖర్గేకు తన తొలినాళ్ల నుంచి రాజకీయాలపై ఆసక్తి ఉంది. కాలేజీ రోజుల్లో విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శిగా, ఆ తర్వాత ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించాడు.తన కెరీర్ ప్రారంభంలో, తన లా డిగ్రీని పూర్తి చేసిన తర్వాత.. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా ఉన్న మాజీ జస్టిస్ శివరాజ్ వి పాటిల్ కార్యాలయంలో అసిస్టెంట్‌గా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు. ఇది కాకుండా.. చట్టం ఆమోదించిన మొదటి రోజుల్లో కార్మిక సంఘాల కేసులపై పోరాడేవాడు. 

1972లో కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసి గుర్మిత్‌కల్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 1972, 1978, 1983, 1985, 1989, 1994, 1999, 2004, 2008, 2009 సంవత్సరాల్లో వరుసగా 9 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. 2005లో ఖర్గే సాహెబ్ కర్నాటక రాష్ట్ర అధ్యక్ష కమిటీకి ఛైర్మన్‌గా నియమితులయ్యారు. 

అక్టోబర్ 18, 2022న కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా ఖర్గే సాహెబ్ ఎన్నికయ్యారు. అక్టోబర్ 17న కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఓటింగ్ నిర్వహించగా, మొత్తం 9,385 ఓట్లు పోలయ్యాయి. ఇందులో ఖర్గేకు 7,897 ఓట్లు రాగా, ఖర్గేపై పోటీ చేసిన శశిథరూర్‌కు 1,072 ఓట్లు వచ్చాయి.  24 ఏళ్ల తర్వాత గాంధేతర కుటుంబానికి చెందని వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగించారు. అయితే.. ఇంతకు ముందు కూడా సీతారాం కేసరి గాంధీ కుటుంబానికి వెలుపల కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 
  

మల్లికార్జున్ ఖర్గే రాజకీయ పదవులు 

1969 - కాంగ్రెస్‌లో చేరి క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు.
1969 - గుల్బర్గా సిటీ నుండి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడయ్యాడు.
1972 – 2009 – గుర్మిట్‌కల్ నియోజకవర్గం నుండి గెలుపొందారు (వరుసగా 9 సార్లు ఎమ్మెల్యే)
1976 - కర్ణాటక విద్యా మంత్రి.
1983 – 1985 – కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
1999 – 2004 – కర్ణాటక రాష్ట్రంలో చిన్న నీటిపారుదల మంత్రి పదవి.
2009 – కర్ణాటకలోని గుల్బర్గా లోక్‌సభ నుంచి ఎన్నికయ్యారు.
2009 - 2013 - కార్మిక, ఉపాధి మంత్రి.
2013 – 2014 – రైల్వేలు, సామాజిక న్యాయం, సాధికారత మంత్రి.
2014 - మరోసారి కర్ణాటకలోని గుల్బర్గా నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.
2017 – 2019 – పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్.
2019 - కర్ణాటకలోని గుల్బర్గా లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఓటమి.
2020 - రాజ్యసభ సభ్యునికి ఏకగ్రీవంగా నామినేట్ చేయబడ్డారు.
2021 - రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు.
2022 - కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

మల్లికార్జున్ ఖర్గే  ప్రొఫైల్  

  • పూర్తి పేరు: మాపన్న మల్లికార్జున్ ఖర్గే
  • వయస్సు: 82 సంవత్సరాలు
  • పుట్టిన తేదీ: 21 జూలై 1942
  • విద్యార్హత : బీఏ(BA), ఎల్.ఎల్.బీ (LLB)
  • రాజకీయ పార్టీ: కాంగ్రెస్ పార్టీ
  • ప్రస్తుత స్థానం: రాజ్యసభ ఎంపీ , కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు
  • తండ్రి పేరు: మాపన్న ఖర్గే
  • తల్లి పేరు: సాయిబావ ఖర్గే
  • భార్య పేరు: రాధాబాయి ఖర్గే
  • పిల్లల పేర్లు: ప్రియాంక్ ఖర్గే, రాహుల్ ఖర్గే, ప్రియదర్శిని ఖర్గే, మిలింద్ ఖర్గే, జయశ్రీ.
  • శాశ్వత చిరునామా: లుంబినీ ఐవాన్-ఎ-షాహి ప్రాంతం, గుల్బర్గా కర్ణాటక,


సవాళ్లు

ఖార్గే గట్టి కాంగ్రెస్ వాదిగా, గాంధీ కుటుంబానికి గట్టి విధేయుడిగా గుర్తింపు తెచ్చుకోవడం నాయకుల జాబితాలో అగ్రస్థానంలో ఉంటుంది. కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీని పునరుద్ధరించే కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన ముందు 2024 సార్వత్రిక ఎన్నికలు, వాటికి ముందు బిజెపి, మోడీ-షాల ప్రజాదరణ ఉంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకరావడం ఆయన ముందున్న పెద్ద సవాల్.

click me!