రథాన్ని లాగుతా... రథంపై ఉండను: పోటీకి దూరమన్న కమల్

Siva Kodati |  
Published : Mar 25, 2019, 11:29 AM IST
రథాన్ని లాగుతా... రథంపై ఉండను: పోటీకి దూరమన్న కమల్

సారాంశం

ప్రముఖ సినీనటుడు కమల్ హాసన్ తన అభిమానులకు, తమిళనాడు ప్రజలకు షాకింగ్ న్యూస్ చెప్పారు. తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. 

ప్రముఖ సినీనటుడు కమల్ హాసన్ తన అభిమానులకు, తమిళనాడు ప్రజలకు షాకింగ్ న్యూస్ చెప్పారు. తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. ఎన్నికల నేపథ్యంలో మక్కల్ నీది మయ్యమ్ పార్టీ తరపున లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితాను ఆయన ఆదివారం ప్రకటించారు.

పోటీ చేసే వారంతా తన ప్రతిరూపాలేనని, రథంలో ఉండటం కంటే రథాన్ని లాగే వ్యక్తిగా ఉండటానికే తాను నిర్ణయించుకున్నానని కమల్ అభిప్రాయపడ్డారు. మరోవైపు ప్రధాని నరేంద్రమోడీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోడీ కేవలం ధనవంతులకే కాపలాదారుడంటూ ధ్వజమెత్తారు. కాగా ఇదే సమావేశంలో పార్టీ మేనిఫెస్టోను కమల్ విడుదల చేశారు.

మక్కల్ నీది మయ్యమ్ మేనిఫెస్టో:

* సమాన వేతం
* మహిళలకు రిజర్వేషన్లు
* అందరికీ ఉద్యోగాలు
* ఐదేళ్లలో 50 లక్షల ఉద్యోగాల కల్పన
* రాష్ట్రం మొత్తం ఫ్రీ వైఫై
* రహదారులపై టోల్ ఫీజు రద్దు

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం