హరిద్వార్ లో మకర సంక్రాంతి పుణ్యస్నానాలకు కరోనా దెబ్బ.. నిషేధం విధించిన ప్రభుత్వం...

By SumaBala BukkaFirst Published Jan 11, 2022, 2:16 PM IST
Highlights

14 వ తేదీ మకర సంక్రాంతికి భక్తులు ఆచరించే పవిత్ర స్నానాలమీద పూర్తి నిషేధం విధిస్తున్నట్లు హరిద్వారా జిల్లా యంత్రాంగం ప్రకటించింది. night curfew కూడా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ ఉంటుందని తెలిపింది. 

న్యూఢిల్లీ : Makar Sankranti 2022కి Haridwar లోని గంగానదిలో పవిత్ర స్నానాలపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిషేధం విధించింది. దేశవ్యాప్తంగా కరోనా అత్యంత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో హరిద్వార్ లో కఠిన ఆంక్షలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

14 వ తేదీ మకర సంక్రాంతికి భక్తులు ఆచరించే holy dipsలమీద పూర్తి నిషేధం విధిస్తున్నట్లు హరిద్వారా జిల్లా యంత్రాంగం ప్రకటించింది. night curfew కూడా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ ఉంటుందని తెలిపింది. 

కాగా, నిరుడు కుంభమేళా సమయంలో హరిద్వార్ లో గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన వందలాది మంది కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. నిరుడు ఏప్రిల్ లో కుంభమేళా సందర్భంగా ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో  వందలాది మంది గంగానదిలో పుణ్యస్నానాలు చేశారు. ఈ స్నానాలు కరోనాకు కేంద్రంగా మారాయి. 

దీంతో ప్రతీరోజూ కరోనా కేసులు వందల సంఖ్యలో నమోదయ్యాయి. ఏప్రిల్ 13న ఒక్కరోజే హరిద్వార్ లో  కొత్తగా 594 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో హరిద్వార్ పట్టణంలో 2,812కి కరోనా కేసుల చేరుకొన్నాయి. మహాకుంభమేళా 13వ రోజైన ఏప్రిల్ 12న పుణ్యస్నానాలు ఆచరించిన 408 మందికి కూడా కరోనా సోకింది.

ఈ సమయంలో 24 గంటల్లో 1925 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 13 మంది మరణించారు. దేశంలో కరోనా సేకండ్ వేవ్ విజృంభిస్తున్న ఆ తరుణంలో గంగానదిలో పుణ్యస్నానాల కోసం వందలాది మంది భక్తులు కుంభమేళాకు వస్తున్నారు. నెల రోజుల పాటు సాగే మహాకుంభమేళాలో సుమారు ఒక్క మిలియన్ మంది పుణ్యస్నానాలు చేస్తారని అధికారులు అంచనా వేశారు.

ఏప్రిల్ 12 నాడు ఒక్క రోజే సుమారు లక్షమంది పుణ్యస్నానాలు చేశారు. మహాకుంభమేళాలో పాల్గొనేందుకు వచ్చిన భక్తుల్లో ఎక్కువమందికి మాస్కులు లేవు. అంతేకాదు భౌతిక దూరం కూడా పాటించ లేదు.  దీంతో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అప్పటివరకు 1,12,071 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో  1780 మంది మరణించారు. 

కాగా, గత 24 గంటల్లో భారత్ లో కొత్తగా 1,68,063 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 8,21,446కు చేరుకుంది. రోజువారీ కోవిడ్ పాజిటివిటీ రేటు 10.64శాతంగా నమోదయ్యింది. 277మంది మృతి చెందారు. దేశంలో ఒమెక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 4,461కి చేరింది. 
 

click me!