మైసూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. టపాసుల పరిశ్రమలో చెలరేగిన మంటలు..

Published : Apr 19, 2023, 05:39 PM IST
మైసూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. టపాసుల పరిశ్రమలో చెలరేగిన మంటలు..

సారాంశం

కర్ణాటకలోని మైసూర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మైసూర్‌లోని హెబ్బల్ పారిశ్రామిక ప్రాంతంలోని ఓ టపాసుల  పరిశ్రమలో బుధవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

కర్ణాటకలోని మైసూర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మైసూర్‌లోని హెబ్బల్ పారిశ్రామిక ప్రాంతంలోని ఓ టపాసుల  పరిశ్రమలో బుధవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ కాసేపటికే పెద్ద ఎత్తున పేలుడు చోటుచేసుకుంది. దీంతో సమీపంలోని ప్రజలు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ  ప్రమాదంలో ఆ ప్రాంతంలో భారీగా పొగలు అలుముకున్నాయి.

ఇక, ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడనికి యత్నిస్తున్నారు. ప్రమాదంలో ఎవరైనా చిక్కుకున్నారా? లేదా? అనే విషయం తెలియాల్సి ఉంటుంది. అయితే ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారాయి.

 

PREV
click me!

Recommended Stories

ఇక ఓటర్లు BLOల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు.. SIRపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
పై నుంచి చూస్తే ఇడ్లీ, రాగి పిండి క‌వ‌ర్లు.. ఓపెన్ చేసి చూడ‌గా అధికారుల‌ ఫ్యూజులు అవుట్