అమానుషం.. వితంతువుపై విచక్షణరహితంగా దాడి.. ముఖానికి మసిపూసి.. మెడలో చెప్పుల దండ వేసి..

Published : Feb 01, 2023, 04:04 AM IST
అమానుషం.. వితంతువుపై విచక్షణరహితంగా దాడి.. ముఖానికి మసిపూసి.. మెడలో చెప్పుల దండ వేసి..

సారాంశం

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఓ అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ గ్రామంలో వితంతు మహిళను కొట్టి, ఆమె ముఖంపై నల్లరంగు పూసి.. తన భర్త మరణానికి ఆమెనే కారణమని అనుమానం వ్యక్తం చేస్తూ కొంతమంది మహిళలు ఆమెకు చెప్పుల దండ వేసి ఊరేగించారు.  ఈ సంఘటన చందవాడ్ తాలూకాలోని శివరే గ్రామంలో జరిగింది.

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఓ అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ వితంతువుపై విచక్షణ రహితంగా దాడి చేయడమే కాకుండా, ఆమె ముఖం నల్లగా చేసి, అత్యంత దారుణంగా అవమానించి మెడలో చెప్పుల  పూలమాల వేసి ఊరంతా ఊరేగించారు. ఈ ఘటన నాసిక్ నగరానికి 65 కి.మీ దూరంలోని చాంద్‌వాడ్ తాలూకాలోని శివ్రే గ్రామంలో జనవరి 30న ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైందని, ఆ తర్వాత ఆమె భర్త ఆమెను తల్లిదండ్రుల ఇంటి వద్ద దింపాడని ఓ అధికారి తెలిపారు. అతను కూడా తన కుమార్తెలతో కలిసి ఆమెను కలవడానికి రెండుసార్లు వచ్చాడు. కొన్ని రోజుల తరువాత, బాధితురాలు తన తల్లిదండ్రుల ఇంట్లో ఉన్నప్పుడు, ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ తన కొడుకు చావుకు తన కోడలే కారణమని ఆమె అత్తమామలు ఆరోపణలు చేస్తున్నారు. 

ఆమె తన భర్త అంత్యక్రియల కోసం తన అత్తమామల ఇంటికి వచ్చినట్లు అధికారి తెలిపారు. జనవరి 30 న మరణానంతర కర్మ సమయంలో ఆ మహిళ తన భర్త మరణించిన పరిస్థితులపై అనుమానాలు వ్యక్తం చేసింది.  అనంతరం మాట మాట పెరిగి పెద్ద గొడవకు దారి తీసింది. ఈ క్రమంలో గ్రామంలోని మరికొందరు మహిళలు బాధితురాలి ముఖానికి నల్లరంగు వేసి బూట్ల దండతో గ్రామంలో ఊరేగించారు. పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకోవడంతో ఆమెను రక్షించినట్లు అధికారి తెలిపారు. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదు.

PREV
click me!

Recommended Stories

ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?
పౌర విమానయాన శాఖపై సభ్యుల ప్రశ్నలు | Minister Ram Mohan Naidu Strong Reply | Asianet News Telugu