మైనర్ బాలికపై మూడేళ్లుగా అత్యాచారం...కీచక టీచర్ అఘాయిత్యం

Published : May 03, 2019, 08:49 PM IST
మైనర్ బాలికపై మూడేళ్లుగా అత్యాచారం...కీచక టీచర్ అఘాయిత్యం

సారాంశం

తన వద్ద చదువుకునే విద్యార్థులను కన్న బిడ్డల్లా చూసుకోవాల్సిన ఓ ఉపాద్యాయుడికి కామంతో కళ్లు మూసుకుపోయాయి. దీంతో అభం శుభం తెలియని ఓ మైనర్ బాలికను బ్లాక్ మెయిల్ చేసి లోబర్చుకున్నాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు గత మూడేళ్లుగా బాలికతో ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తూ లైంగిక వాంఛ తీర్చుకుంటున్నాడు. అయితే ఎలాగోలా చివరకు ఈ విషయం బయటపడి సదరు కీచక టీచర్ కటకటాలపాలయ్యాడు. ఈ అమానవీయ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.   

బాధిత బాలిక పదమూడేళ్ల వయసులో ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు 56 ఏళ్ల ఉపాధ్యాయుడు కన్నేశారు. ఆమెను ఎలాగైన లొంగదీసుకోవాలని అవకాశం కోసం   ఎదురుచూశాడు. అయితే ఆ అవకాశం రానే వచ్చింది. బాలికకు సంబంధించిన న్యూడ్ ఫోటోలను సంపాదించి బ్లాక్ మెయిల్ చేయడం ఆరంభించారు. అయితే తన ఫోటోలు బయటకు వస్తే పరువు పోతుందని బావించిన  బాలిక ఆ కీచకుడి కబందహస్తాల్లో చిక్కుకుంది.  ఇలా దాదాపు మూడెళ్లుగా ఆమెపై నిత్యం అత్యాచారానికి పాల్సడుతూ వస్తున్నాడు. 

అయితే బాదిత బాలిక స్కూలింగ్ ముగించుకుని కాలేజీలో చేరినా అతడు వదల్లేదు.తరచూ ఆమెను పిలుచుకుని అత్యాచారం చేసేవాడు. అయితే ఈ మధ్యకాలంలో అతడి  లైంగిక వేధింపులు మరీ ఎక్కువవడంతో ఆమె తట్టుకోలేకపోయింది. తాను చదివే కళాశాల ఉపాధ్యాయులకు ఈ విషయం గురించి తెలియజేసి బోరున విలపించింది. దీంతో వారు బాలిక పేరు బయటకు రాకుండా జాగ్రత్త పడి ఆ కీచక టీచర్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు. 

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు కామాంధుని అరెస్ట్ చేశారు. అతడిపై పోక్సో చట్టాన్ని ప్రయోగించిన పోలీసులు న్యాయస్థానంలో కూడా కఠిన శిక్ష పడేలా చూస్తామని తెలిపారు. 
 
PREV
click me!

Recommended Stories

ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?
పౌర విమానయాన శాఖపై సభ్యుల ప్రశ్నలు | Minister Ram Mohan Naidu Strong Reply | Asianet News Telugu