పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం.. ఐటీ కమిషనర్ పై కేసు..!

Published : May 17, 2021, 10:22 AM ISTUpdated : May 17, 2021, 11:10 AM IST
పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం.. ఐటీ కమిషనర్ పై కేసు..!

సారాంశం

వివాహం చేసుకుంటానని చెప్పి నాగపూర్ ఆదాయ పన్నుశాఖ కమిషనర్ తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళా వైద్యురాలు ఇచ్చిన ఫిర్యాదుతో నాగపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.   


ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఓ యువతిని మోసం చేశాడంటూ ఐటీ కమిషనర్ పై కేసు నమోదైంది. ఈ సంఘటన నాగ్ పూర్ లో చోటుచేసుకుంది. వివాహం చేసుకుంటానని చెప్పి నాగపూర్ ఆదాయ పన్నుశాఖ కమిషనర్ తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళా వైద్యురాలు ఇచ్చిన ఫిర్యాదుతో నాగపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. 

2019 లో నేషనల్ అకాడమీ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (ఎన్ఎడీటీ) లో శిక్షణ పొందుతున్న ఐటీ కమిషనర్ పుదుచ్చేరి నివాసి. నిందితుడైన ఐటీ కమిషనర్ వైద్య చికిత్స కోసం నాగపూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లినపుడు అక్కడ పనిచేస్తున్న మహిళా వైద్యురాలితో పరిచయం ఏర్పడింది. 

యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న మహిళా డాక్టరుకు నిందితుడైన ఐటీ కమిషనర్ తన మొబైల్ నంబరు ఇచ్చాడని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. కాగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !
DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?