ఇలా కూడా పెళ్లి చేసుకోవచ్చు.. టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన మ్యారేజ్ వీడియో..

By AN TeluguFirst Published Jul 28, 2021, 3:53 PM IST
Highlights

‘పెళ్లి వేడుక కోసం ఇంటి దగ్గర ఓ ఫంక్షన్ హాల్ బుక్ చేశాం. కానీ వర్షం వల్ల మరోచోటికి మార్చాం. కొద్దిమంది అతిథులతో సోనాలి (పెళ్లి కూతురు) ఇంట్లో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం.  దీని కోసం ఓ పడవను ఏర్పాటు చేశాం.  

మహారాష్ట్ర లోని పలు నగరాలను వర్షాలు ముంచెత్తాయి. దీంతో ఎక్కడ చూసినా వరద పొంగిపొర్లుతోంది. ఇదే క్రమంలో సాంగ్లీ నగరాన్ని కూడా వరదలు వదల్లేదు. అయితే వరద నీరు పోటెత్తడంతో పెళ్ళిళ్ళు వివిధ కార్యక్రమాలు వాయిదా పడ్డాయి.  తాజాగా ఓ ప్రేమికుల జంట కు ఈ నెల 23న నిశ్చితార్థం జరిగింది.  అయితే పెళ్లికి ముహూర్తం ఖరారు చేసే సమయానికి ఆ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి.

ఈ విషయంపై పెళ్ళికొడుకు రోహిత్ సూర్య వంశీ మాట్లాడుతూ...‘పెళ్లి వేడుక కోసం ఇంటి దగ్గర ఓ ఫంక్షన్ హాల్ బుక్ చేశాం. కానీ వర్షం వల్ల మరోచోటికి మార్చాం. కొద్దిమంది అతిథులతో సోనాలి (పెళ్లి కూతురు) ఇంట్లో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం.  దీని కోసం ఓ పడవను ఏర్పాటు చేశాం.  అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఇంటికి రావాలి.  అందువల్ల మళ్లీ తిరిగి ఇక్కడికి చేరుకున్నాం. 

అంతే కాకుండా కోవిడ్‌కు సంబంధించిన అన్ని రకాల నిబంధనలను పాటించి, ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశాం. ఇప్పటికే పెళ్లి వేడుక కోసం అన్ని రకాల సామాగ్రిని కొనుగోలు చేశాం. కాబట్టి ఇబ్బంది లేదు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా పెళ్లి తేదీని వాయిదా వేసే ప్రసక్తి లేదని నిర్ణయించుకుని ముందుకు సాగాం. ఇక పెళ్లి తర్వాత బరాత్ కార్యక్రమం ఉంటుంది. కానీ దాన్ని పక్కకు పెట్టాల్సి వచ్చింది’  అని తెలిపారు.

దీని పై నెటిజనులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మీ పట్టుదలకు వందనాలు అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం వీరి వివాహ వేడుకకు సంబంధించిన టైమ్స్ ఆఫ్ ఇండియా వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 

click me!