రేపు అసెంబ్లీలో బలపరీక్ష ఎలా సాధ్యమౌతుంది: సుప్రీంలో శివసేన వాదన ఇదీ

By narsimha lodeFirst Published Jun 29, 2022, 6:13 PM IST
Highlights

మహారాష్ట్ర అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవడం రేపు సాధ్యం కాదని శివసేన తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి సుప్రీంకోర్టులో వాదించారు. శివసేన దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ సాయంత్రం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

హైదరాబాద్: రేపు  Maharashtra అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవడం సాధ్యం కాదని Shiv Senaతరపు న్యాయవాది సింఘ్వి Supreme Court లో వాదించారు. మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకోవాలని  గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ శివసేన దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు బుధవారం నాడు సాయంత్రం విచారణను ప్రారంభించింది.

Governor ఆదేశాలను సవాల్ చేస్తూ శివసేన చీఫ్ విప్ Suresh Prabhu  బుధవారం నాడు ఉదయం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ పై ఇవాళ సాయంత్రం విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. 

శివసేన తరపున సింఘ్వి వాదనలు విన్పించారు.  NCP కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది.  కాంగ్రెస్ కు చెందిన ఇద్దర ఎమ్మెల్యేలు విదేశాల్లో ఉన్నారని ఆయన చెప్పారు. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీలో బల పరీక్ష ఎలా నిర్వహిస్తారని ఆయన ప్రశ్నించారు. రేపు బలపరీక్ష నిర్వహించడం సాధ్యం  కాదని సింఘ్వి సుప్రీంకోర్టులో తెలిపారు. 

మరో వైపు  బలపరీక్షకు ఒక్క రోజు సమయం ఇవ్వడాన్ని కూడా సింఘ్వి ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకు వచ్చారు. అంతేకాదు బలపరీక్షలో రేపు ఓటు వేసే ఎమ్మెల్యేల్లో కొందరిపై అనర్హత వేటు ఉందన్నారు. ఈ సమయంలో వారు బలపరీక్షలో ఓటు వేసే విషయాన్ని సింఘ్వి ప్రశ్నించారు.  

also read:మహా అసెంబ్లీలో బలపరీక్ష: శివసేన పిటిషన్ పై నేడు ఐదు గంటలకు సుప్రీంలో విచారణ

రాజ్యాంగం ప్రకారం వారు తమ సభ్యత్వాన్ని కోల్పోయినట్టేనని ఆయన చెప్పారు. రెబెల్ ఎమ్మెల్యేలు రాజీనామా  చేయకపోయినా అనర్హత వేటుకు గురయ్యారని సింఘ్వి చెప్పారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ కు రెబెల్ ఎమ్మెల్యేలు లేఖ రాయడమంటేనే శివసేన సభ్యత్వాన్ని స్వచ్ఛంధంగా వదులుకుట్టేనని సింఘ్వి  కోర్టు దృష్టికి తెచ్చారు. ఎమ్మెల్యే అనర్హతపై జూలై 12న స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని సింఘ్వి చెప్పారు. అనర్హత పిటిషన్ ను పక్కన పెట్టి ఫ్టోర్ టెస్ట్ నిర్వహించిన సందర్భాలు లేవని ఆయన చెప్పారు. ఎవరు అర్హులో, ఎవరు అనర్హులో ఎలా చెప్పగలరని సింఘ్వి ప్రశ్నించారు.గతంలో ఉత్తరాఖండ్ సంక్షోభాన్ని అభిషేక్ సింఘ్వి ప్రస్తావించారు. 

click me!