బర్త్ డే కేక్‌ను తల్వార్‌తో కట్ చేశాడు.. కటకటాలపాలయ్యాడు

Published : Sep 04, 2022, 11:44 PM IST
బర్త్ డే కేక్‌ను తల్వార్‌తో కట్ చేశాడు.. కటకటాలపాలయ్యాడు

సారాంశం

మహారాష్ట్రలో ఓ కుర్రాడు తన బర్త్ డే కేక్‌ను పబ్లిక్‌గా తల్వార్‌తో కట్ చేశాడు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అనంతరం, పోలీసులు ఈ సెలబ్రేషన్‌లో ఉన్న నలుగురు యువకులను అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలింపులు జరుపుతున్నారు.  

ముంబయి: మహారాష్ట్రలో కొందరు యువకుల అత్యుత్సాహం వారిని జైలు పాలు చేసింది. ఓ యువకుడు తన బర్త్ డే వేడుకను వినూత్నంగా చేసుకోవాలని అనుకున్నాడు. తన బర్త్ డే కేక్‌ను బహిరంగంగా తల్వార్‌తో కట్ చేశాడు. అనంతరం ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఫొటోలు మహారాష్ట్ర పోలీసుల దృష్టిలో పడింది. దీంతో వెంటనే వారు యాక్షన్‌లోకి దిగారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలింపులు జరుపుతున్నారు.

మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. అరెస్టు చేసిన వారిని హృతిక్ హుల్గుండే, వాజిద్ సయ్యద్, సంవిధాన్ ధావరే, సంవక్ కాంబ్లేలుగా వివేకానంద్ పోలీసు స్టేషన్ ఎస్ఐ మహేష్ గల్గాటే తెలిపారు.

ఈ నెల 2వ తేదీన హృతిక్ హుల్గుండే బర్త్ డే ఉన్నది. ఆయన బర్త్ డేను బహిరంగంగా సెలెబ్రేట్ చేశారు. కేక్‌ను హృతిక్ హుల్గుండే తల్వార్‌తో కట్ చేశాడు. అనంతరం, ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ ఘటన అభ్యంతరకరంగా ఉండటంతో పోలీసులు రంగంలోకి దిగారు. పై నలుగురిని అరెస్టు చేశారు. ఈ బర్త్ డే సెలబ్రేషన్‌లో పాలు పంచుకున్న మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. పోలీసులు ఇప్పుడు వారి కోసం గాలింపులు జరుపుతున్నారు.

PREV
click me!

Recommended Stories

భార‌త్‌లో బ‌య‌ట‌ప‌డ్డ రెండో ప్ర‌పంచ యుద్ధం నాటి బాంబులు.. 80 ఏళ్ల నుంచి పేల‌కుండా ఉన్నాయి.
Lockdown : మళ్లీ ఇండియాలో లాక్ డౌన్ విధిస్తారా..? ఆల్ పార్టీ మీటింగ్ లో కేంద్రం క్లారిటీ