
శరద్ పవార్ కుమార్తె, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సులేకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె ఓ కార్యక్రమంలో దీపం వెలిగిస్తుండగా.. ప్రమాదశాత్తువు చీరకు నిప్పంటుకుంది. పక్కన వారు వెంటనే అప్రమత్తం కావడంతో మంటలర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది.
వివరాల్లోకెళ్తే.. పుణెలో కరాటే పోటీని ప్రారంభించేందుకు బారామతి ఎంపీ సుప్రియా సూలే హింజావాడిలో జరిగిన ఒక కార్యక్రమానికి వచ్చారు. ఇంతలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేస్తుండగా ఆయన చీరకు మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన సుప్రియా సులే.. మంటలను ఆర్పివేశారు. దీంతో ఎలాంటి గాయాలు కాలేదు. తాను క్షేమంగానే ఉన్నానని.. శ్రేయోభిలాషులు, పార్టీ కార్యకర్తలు , నాయకులందరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎంపీ సుప్రియా సులే వెల్లడించారు.
అజిత్ పవార్‌కు తప్పిన పెద్ద ప్రమాదం
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నాయకుడు అజిత్ పవార్ కూడా త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం పూణెలోని ఆసుపత్రిలో ఒక వైద్యుడు, మరో ఇద్దరితో కలిసి లిఫ్ట్‌లో వెళుతుండగా, అకస్మాత్తుగా కరెంటు పోయి, లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్‌లో పడిపోయింది. బారామతిలో జరిగిన ఓ కార్యక్రమంలో పవార్ మాట్లాడుతూ.. శనివారం తాను ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించేందుకు వెళ్లానని, ఆ సమయంలోనే ఈ ఘటన జరిగిందని చెప్పారు.
అజిత్ పవర్ మాట్లాడుతూ.. తాను ఇద్దరు భద్రతా సిబ్బంది, ఒక వైద్యునితో కలిసి మూడవ అంతస్తుకు లిఫ్ట్‌లో వెళ్లామనీ, ఈ సమయంలో అనుకోకుండా విద్యుత్ సరఫరా . కానీ లిఫ్ట్ కదలకపోవడంతో ఒక్కసారిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లిఫ్ట్ అకస్మాత్తుగా పడిపోయి నేరుగా గ్రౌండ్ ఫ్లోర్‌లో ఆగిపోయిందని అన్నారు. భద్రతా సిబ్బందిని మెచ్చుకుంటూ, వారు లిఫ్ట్ డోర్‌ని తెరవగలిగారు. దీంతో అందరి భద్రతకు భరోసా ఇచ్చారని పవార్ చెప్పారు. వైద్యుడికి స్వల్ప గాయాలైనప్పటికీ.. ఈ ఘటన గురించి ఇప్పటి వరకు తన భార్యకు కూడా చెప్పలేదని పవార్ అన్నారు.