కరోనా కలవరం.. నలుగురు ఎమ్మెల్యేలకు పాజిటివ్

By telugu news teamFirst Published Jul 3, 2020, 8:20 AM IST
Highlights

మహారాష్ట్రలో మరో మహిళా ఎమ్మెల్యేతోపాటు ఆమె భర్తకు కరోనా వైరస్ సోకింది. థానే జిల్లాకు చెందిన ఓ మహిళా ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలిందని అధికారులు ప్రకటించారు. 
 

కరోనా వైరస్ దేశంలో విలయతాండవం చేస్తోంది. లాక్ డౌన్ సడలింపులు చేసిన దగ్గర నుంచి కేసుల సంఖ్య మరింతగా పెరిగిపోయాయి. రోజు రోజుకీ ఊహించని విధంగా కేసులు నమోదౌతున్నాయి. ప్రతి రోజూ 15వేలకు మించిన కేసులు నమోదవ్వడం ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది.

సామాన్యులు, సెలబ్రెటీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అనే తేడా లేకుండా అందరినీ ఈ వైరస్ కలవరపెడుతోంది. తాజాగా... మహారాష్ట్రలో మరో మహిళా ఎమ్మెల్యేతోపాటు ఆమె భర్తకు కరోనా వైరస్ సోకింది. థానే జిల్లాకు చెందిన ఓ మహిళా ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలిందని అధికారులు ప్రకటించారు. 

అనంతరం ఎమ్మెల్యే భర్తకు పరీక్షలు చేయగా ఆయనకు కూడా కరోనా ఉందని తేలడంతో వారిద్దరిని హోం క్వారంటైన్ చేశారు. గతంలో థానే జిల్లాలోనే ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీకి కొవిడ్-19 సోకింది. 

థానే జిల్లాలోనే మరో మహిళా ఎమ్మెల్యేకు కరోనా సోకడంతో కరోనా సోకిన ఎమ్మెల్యేల సంఖ్య 4కు చేరింది. మహారాష్ట్రలో ఓ హిందీ రచయిత్రి (60) కొవిడ్-19తో మరణించారు. థానే జిల్లాలో కరోనా రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 

ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. దేశంలో ఎక్కువ కరోనా కేసులు మహారాష్ట్ర, ఢిల్లీల్లోనే ఎక్కువగా నమోదవ్వడం గమనార్హం. 

click me!