Mutton : ఇకపై హిందువుల మటన్, గుర్తించడం చాలా ఈజీగా : హలాల్ మాంసానికి చెక్

Published : Mar 10, 2025, 10:16 PM ISTUpdated : Mar 10, 2025, 10:18 PM IST
Mutton : ఇకపై హిందువుల మటన్, గుర్తించడం చాలా ఈజీగా : హలాల్ మాంసానికి చెక్

సారాంశం

మహారాష్ట్రలో హిందువులు నిర్వహించే మటన్ షాపులకు 'మల్హార్ సర్టిఫికేషన్' అందిస్తున్నారు. ఇంతకూ ఈ సర్టిఫికేషన్స్ ఎందుకు ఇస్తున్నారో తెలుసా?   

Malhar Certification : మహారాష్ట్రలో హిందూ మటన్ షాపుల కోసం కొత్త సర్టిఫికేషన్‌ను సోమవారం ప్రకటించారు. హిందూ మటన్ షాపులకు ప్రభుత్వం తరపున 'మల్హార్ సర్టిఫికేషన్' ఇస్తారని మంత్రి నితీష్ రాణే చెప్పారు. ఈ సర్టిఫికెట్ కింద హిందూ సమాజానికి చెందిన వాళ్లు నడిపే షాపులకు మాత్రమే గుర్తింపు ఉంటుంది.

మల్హార్ సర్టిఫికేషన్ ఉద్దేశం ఏమిటి?

మల్హార్ సర్టిఫికేషన్ ద్వారా హిందూ సమాజంలోని యువత కూడా మటన్ షాపులు తెరిచి ఆర్థికంగా ఎదగాలనేది మొదటి ఉద్దేశం అని నితీష్ రాణే అన్నారు. దీంతో మటన్‌లో కల్తీ జరగకుండా చూసుకోవచ్చు. మల్హార్ సర్టిఫికేషన్ లేని షాపుల్లో హిందువులు మటన్ కొనొద్దని రాణే విజ్ఞప్తి చేశారు.

మల్హార్ సర్టిఫికేషన్ ద్వారా మనకు మంచి మటన్ షాపులు దొరుకుతాయి. అలాగే షాపు యజమానులు కూడా 100% హిందూ సమాజానికి చెందిన వారే ఉంటారని రాణే తన ప్రకటనలో పేర్కొన్నారు.

అసలు మల్హార్ సర్టిఫికేషన్ అంటే ఏమిటి?

మల్హార్ సర్టిఫికేషన్ అనేది హలాల్ సర్టిఫికేషన్ లాంటి కొత్త ప్రయత్నం. ఇస్లామిక్ చట్టాల ప్రకారం హలాల్ మాంసం తయారు చేస్తారు.  హలాల్ పద్ధతిలో జంతువు రక్తాన్ని ముందుగా తీసేస్తారు. భారతదేశంలో గత కొన్నేళ్లుగా హలాల్ మాంసంపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. 

కర్ణాటకలో మొదటిసారిగా కొన్ని మితవాద సంస్థలు హలాల్ మాంసాన్ని బహిష్కరించాలని డిమాండ్ చేసినప్పుడు ఈ వివాదం మొదలైంది. దీన్ని ఆర్థిక జిహాద్‌గా అభివర్ణించారు. ఈ ప్రక్రియలో హిందువులను మాంసం పరిశ్రమలో పనిచేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

హలాల్ సర్టిఫికేషన్ మాంసానికి మాత్రమే పరిమితం కాదు. శాకాహార పదార్థాలు, మందులు, సౌందర్య సాధనాల్లో కూడా దీన్ని ఉపయోగిస్తారు. ముస్లిం దేశాలకు ఎగుమతి చేయడానికి హలాల్ సర్టిఫికెట్ తప్పనిసరి. దీనివల్ల హలాల్ మీట్ పరిశ్రమ చాలా పెద్దదిగా తయారైంది.

PREV
click me!

Recommended Stories

కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు
Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?