మోటారు పంప్‌ అమర్చుతూ.. విద్యుదాఘాతంతో నలుగురు మృతి.. మృతుల్లో తండ్రీకొడుకులు 

By Rajesh KarampooriFirst Published Dec 15, 2022, 4:15 PM IST
Highlights

మహారాష్ట్రలో పెను విషాదం చోటుచేసుకుంది. పూణే జిల్లాలోని భోర్ తాలూకాలోని నదిలో గురువారం మధ్యాహ్నం నీటి పంపును అమర్చుతుండగా విద్యుదాఘాతానికి గురై నలుగురు మృతి చెందినట్లు పూణే రూరల్ పోలీసులు తెలిపారు. బాధితుల్లో తండ్రీకొడుకులు కూడా ఉన్నారని వారు తెలిపారు.
 

మహారాష్ట్రలోని పూణెలో ఘోర ప్రమాదం వెలుగు చూసింది. భోర్ తహసీల్‌లోని నిగడే గ్రామంలో విద్యుదాఘాతంతో నలుగురు వ్యక్తులు మరణించారు. నిగడే గ్రామానికి చెందిన గుంజ్వానీలో రిజర్వాయర్‌లో మోటారు పంప్‌ను అమర్చే పని జరుగుతుండగా.. విద్యుదాఘాతానికి గురై నలుగురు మృతి చెందారు.

పోలీసులు సమాచారం ప్రకారం.. భోర్ తహసీల్‌లోని నిగడే గ్రామానికి చెందిన గుంజ్వానీలో రిజర్వాయర్‌లో మోటారు పంప్‌ను అమర్చే పని జరుగుతుండగా ఒక్కసారిగా కరెంట్‌ వచ్చి విద్యుదాఘాతానికి గురై నలుగురు మృతి చెందారు. బాధితుల్లో తండ్రీకొడుకులు కూడా ఉన్నారని వారు తెలిపారు. పూణె నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిగడే గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

బాధితులు తమ పొలాలకు నీరు పెట్టేందుకు గుంజవాణి నదిలో నీటిపారుదల పంపును అమర్చుకుంటున్నారు.ఈ ఘటనలో  విట్టల్ మలుసరే(45) అతని కుమారుడు సన్నీ మలుసరే(26),అమోల్ మలుసరే(36),ఆనంద జాదవ్(55)లు మృతి చెందినట్టు గుర్తించారు.  మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (MSEDCL) అధికారులు కూడా ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు.

ఈ ఘటనపై రాజ్‌గడ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఇన్‌స్పెక్టర్ సచిన్ పాటిల్ మాట్లాడుతూ.. “నలుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. MSEDCL అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మరణాలకు దారితీసిన కారణాలపై దర్యాప్తు ప్రారంభించాముమని తెలిపారు.

ఈ ఘటనపై డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) భౌసాహెబ్ ధోలే స్పందించారు. ఇటీవల నీటి మట్టం తగ్గినందున నలుగురు వ్యక్తులు నదిలో అమర్చిన పంపును  మరో స్థలంలో బిగించాలని ప్రయత్నిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందనీ, పంప్ కోసం ఏర్పాటు చేసిన కేబుల్‌లో సరిగా లేదనీ, అనేక చోట్ల కేబుల్ పై భాగం తేలినట్టు పోలీసులు గుర్తించారు.  MSEDCL నుండి ఎలక్ట్రిక్ ఇన్‌స్పెక్టర్లు విచారణను నిర్వహిస్తారు. దాని ఆధారంగా మేము తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

click me!