మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కు కరోనా: హోం ఐసోలేషన్ లో ఎన్సీపీ నేత

Published : Jun 27, 2022, 05:16 PM ISTUpdated : Jun 27, 2022, 05:29 PM IST
 మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కు కరోనా: హోం ఐసోలేషన్ లో ఎన్సీపీ నేత

సారాంశం

 మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కు కరోనా సోకింది. రెండు రోజుల క్రితం మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతో అజిత్ పవార్ భేటీ అయ్యారు. ఇప్పటికే  ఉద్దవ్ ఠాక్రే కరోనాతో చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఉన్న ఉద్ధవ్ తో అజిత్ పవార్ భేటీ కావడంతో ఆయనకు కూడా కరోనా సోకింది.

ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం Ajit pawar కు  కరోనా సోకింది. రెండు రోజుల క్రితం మహారాష్ట్ర సీఎం Uddhav Thackerayతో అజిత్ పవార్ భేటీ అయ్యారు. దీంతో ఆయనకు కూడా Corona సోకింది. ప్రస్తుతం అజిత్ పవార్ హోం ఐసోలేషన్ లో ఉన్నారు. తనకు కరోనా సోకిన విషయాన్ని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

తాను వైద్యుల సలహాను పాటిస్తున్నట్టుగా చెప్పారు. త్వరలోనే కరోనా నుండి కోలుకుంటానని చెప్పారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారంతా కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని అజిత్ పవార్ కోరారు. 

 

మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ, సీఎం ఉద్దవ్ ఠాక్రే లు కరోనా బారిన పడ్డారు. గవర్నర్ ఆసుపత్రి నుండి రెండు రోజుల క్రితమే డిశ్చార్జ్ అయ్యారు. సీఎం ఉద్దవ్ ఠాక్రే మాతోశ్రీ నుండే  కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అజిత్ పవార్ ప్రస్తుతం కరోనా బారినపడ్డారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయింది., శివసేన నుండి సుమారు 40 మంది ఎమ్మెల్యేలు తనకు మద్దతుగా ఉన్నారని ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు.

శివసేనలో సంక్షోభం పరిష్కరించేందుకు ఆ పార్టీ నాయకత్వం ప్రయత్నం చేస్తుంది. మరో వైపు ఈ సంకీర్ణ సర్కార్ లో భాగస్వామ్యపక్షాలుగా ఉన్న కాంగ్రెస్, ఎన్పీపీలు కూడా ఈ సంక్షోభ నివారణకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ తరుణంలో అజిత్ పవార్ కు కరోనా సోకింది.ఇదిలా ఉంటే మహారాష్ట్రలో ఆదివారం నాడు 6493 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఐదుగురు మరణించారు.

PREV
click me!

Recommended Stories

ISRO Calendar: ఇస్రో చ‌రిత్ర‌లో 2026 చాలా కీల‌కం.. గ‌గ‌న్‌యాన్ స‌హా ప‌లు కీల‌క ప్రాజెక్టులు
Vaikunta Ekadashi:తెరుచుకున్న వైకుంఠ ద్వారం భక్తులతో కిటకిటలాడిన పెరుమాళ్ ఆలయం | Asianet News Telugu