
Maharashtra Crime: క్షణికావేశం ఓ ఇంట్లో తీవ్ర విషాదం మిగిల్చింది. నిండు జీవితాన్ని బలితీసుకుంది. చిన్న విషయాన్ని చాలా అతిగా ఆలోచించి, భార్యను హత్య చేశారు. కేవలం అల్పాహారంలో ఉప్పు ఎక్కువ అయ్యిందనే కోపంతో హత్య చేశాడు ఓ భర్త. ఈ ఘటన మహారాష్ట్ర థానే జిల్లాలోని భయాందర్ టౌన్‌షిప్‌లో చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మహారాష్ట్రలోని థానే జిల్లాలోని భయందర్ టౌన్ షిప్ లో నీలేష్ గాగ్ అలియాస్ నీలేష్ (46) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 16 ఏండ్ల క్రితం నిర్మలా (41) అనే మహిళను ఆయనకు వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. వీరి కాపురం చాలా సంతోషంగా సాగుతోంది. కానీ నీలేష్ కు కోపం చాలా ఎక్కువ. దీంతో చిన్నచిన్న విషయాల్లో నీలేష్, నిర్మలా దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి.
అందరి ఇళ్లల్లో ఉండే గొడవలే కదా అంటూ పెద్దలు కూడా నీలేస్, నిర్మలా దంపతుల విషయంలో పెద్దగా జోక్యం చేసుకోలేదు. నిర్మలా భర్త నీలేష్ కు కోపం చాలా ఎక్కువ అని అతని బంధువులు, స్నేహితులు అంటున్నారు. గత కొంతకాలం నుంచి నీలేష్, నిర్మలా దంపతుల గొడవలను వాళ్లు బంధువులు చూసిచూడనట్లు వదిలేస్తున్నారు. గొడవ పడటం, రెండు మూడు రోజులకు మళ్లీ ఒక్కటి కావడం వీరికి మామూలే అయింది.
ఇప్పటిలాగానే.. శనివారం ఉదయం నిర్మలా.. బ్రేక్ పాక్ట్ గా వేడివేడిగా కిచడీ చేసి ఆమె భర్త నీలేష్ కు వడ్డించింది. కిచడీ తింటున్న సమయంలో.. టిఫిన్ లో ఉప్పు ఎక్కువగా వేశావని నీలేష్ గొడవ ప్రారంభించాడు. ఈ క్రమం ఇరువురి మధ్య గొడవ ప్రారంభమైంది. ఆ గొడవ కాస్త పెద్ద కావడంతో నీలెష్ భార్య నిర్మలాను పట్టుకుని చితకబాదేశాడు. కిందపడేసి.. దారుణంగా చితకబాదాడు. ఈ క్రమంలో నిర్మలాకు తీవ్ర గాయలు కావడంతో .. అక్కడికడ్కడే ప్రాణాలు విడిచింది.
ఈ సంఘటన శుక్రవారం ఉదయం భయాందర్ ఈస్ట్‌లోని ఫటక్ రోడ్ ప్రాంతంలో జరిగింది, దీని తరువాత పోలీసులు నిందితులను అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు, దాడికి మరేదైనా రెచ్చగొట్టే కారణం ఉందా అని పోలీసులు నిర్ధారిస్తున్నారని అధికారి తెలిపారు. భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 302 (హత్య) కింద ఆ నిందితుడిపై నమోదు చేయబడింది.