ఎన్నికలకు రెడీ.. రెబెల్ ఎమ్మెల్యేల్లో ఒక్కరు ఓడినా, రాజకీయాలకు గుడ్‌బై: ఉద్ధవ్‌కు ఏక్‌నాథ్ షిండే సవాల్

Siva Kodati |  
Published : Jul 16, 2022, 09:27 PM IST
ఎన్నికలకు రెడీ.. రెబెల్ ఎమ్మెల్యేల్లో ఒక్కరు ఓడినా, రాజకీయాలకు గుడ్‌బై: ఉద్ధవ్‌కు ఏక్‌నాథ్ షిండే సవాల్

సారాంశం

తన మాజీ బాస్ ఉద్ధవ్ థాక్రే విసిరిన సవాల్‌కు ధీటుగా బదులిచ్చారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే. రెబల్ ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరు ఓడిపోయినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన స్పష్టం చేశారు. 

మహారాష్ట్రలో (maharashtra) ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వాన్ని (uddhav thackeray) విజయవంతంగా కూల్చిన ఏక్‌నాథ్ షిండే (eknath shinde) పాలనపై పట్టు బిగించడంతో పాటు ప్రజల్లో తన ఇమేజ్ పెంచుకునేందుకు పావులు కదుపుతున్నారు. అలాగే అసలైన శివసేన (shivsena) తమదే అనే వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో రెబల్ ఎమ్మెల్యేలు దమ్ముంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలంటూ మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే విసిరిన సవాల్‌కు సీఎం ఏక్‌నాథ్ షిండే స్పందించారు. ఉప ఎన్నికల్లో తమ ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరు ఓడిపోయినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన సవాల్ విసిరారు. ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో ప్రజలే నిర్ణయిస్తారని ఏక్‌నాథ్ షిండే స్పష్టం చేశారు. 

ఇకపోతే.. రాష్ట్రంలోని ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్లను మారుస్తున్నట్లు సీఎం ఏక్నాథ్ షిండే ప్రకటించారు. కేబినెట్ సమావేశంలో ఔరంగాబాద్‌ను సంభాజీనగర్‌గా, ఉస్మానాబాద్‌ను ధరాశివ్‌గా మార్చాలని నిర్ణయించినట్లు చెప్పారు. అలాగే నవీ ముంబై ఎయిర్‌పోర్ట్ పేరును డిబి పాటిల్ ఎయిర్‌పోర్ట్‌గా మార్చారు. ఇప్పటికే ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ.. ఆ ప్ర‌క్రియ  చట్టవిరుద్ధమని పేర్కొంటూ.. షిండే మంత్రివర్గం మ‌ళ్లీ ఆమోదించింది.

ALso Read:Maharashtra Cabinet: ఉద్ధవ్ ప్రభుత్వ నిర్ణయం చట్టవిరుద్ధం.. న‌గ‌రాల పేర్ల మార్పుపై కీల‌క ప్ర‌క‌ట‌న

మహారాష్ట్రలోని  ఔరంగాబాద్, ఉస్మానాబాద్ న‌గ‌రాల‌ పేర్లను మార్చుతామ‌ని, గతంలోనే మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. అయితే.. ఏక్‌నాథ్ షిండేతో పాటు దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్న సమయంలో ఈ ప్రకటన వెలువడింది. కొన్ని గంటల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే కూడా రాజీనామా చేశారు. అందుకే షిండే.. సీఎం అయిన తర్వాత స్వయంగా కేబినెట్ సమావేశం పెట్టి.. ఈ నిర్ణయం తీసుకున్నారు, గతంలో తీసుకున్న నిర్ణయం చెల్లదని తేల్చిచెప్పారు. ఈ నిర్ణయం ఉద్ధవ్ ఠాక్రే తీసుకోలేదని, శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే చాలా దశాబ్దాల క్రితమే ఔరంగాబాద్ పేరును సంభాజీనగర్‌గా మారుస్తున్నట్లు ప్రకటించారనీ సీఎం ఏక్‌నాథ్ షిండే స్పష్టం చేశారు. 

పార్టీని, కార్యకర్తలను కాపాడేందుకే తాను శివసేన నాయకత్వంపై తిరుగుబాటు చేశానన్నారు. మూడు పార్టీల సంకీర్ణ ప్రభుత్వంలో శివ‌సేన అధినేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ రాజకీయంగా ఏమీ సాధించలేదన్నారు. నగర పంచాయతీ ఎన్నికల్లో నాలుగో స్థానంలో నిలిచామ‌నీ, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తిరుగుబాటు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు ఆమోదించారని షిండే పేర్కొన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu