మహారాష్ట్ర క్యాబినెట్ విస్తరణ.. ఫడ్నవీస్‌ బిగ్ స్కోర్.. హోం, ఫైనాన్స్ బాధ్యతలు.. సీఎంకు పట్టణ అభివృద్ధి

By Mahesh KFirst Published Aug 14, 2022, 6:08 PM IST
Highlights

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే పోర్ట్‌ఫోలియోలను కేటాయించారు. తాను పట్టణ అభివృద్ధి శాఖ బాధ్యతలు తీసుకున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్‌కు హోం శాఖ, ఫైనాన్స్ శాఖలను అప్పగించారు.
 

న్యూఢిల్లీ: మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ఆదివారం మంత్రులకు శాఖలను అప్పగించారు. ఇందులో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ బిగ్ స్కోర్ చేశారు. ఆయన కీలకమైన హోం శాఖ, ఆర్థిక శాఖను పొందారు. కాగా, సీఎం ఏక్‌నాథ్ షిండే తన వద్ద పట్టణ అభివృద్ధి శాఖ, పబ్లిక్ వర్క్స్ (పబ్లిక్ ప్రాజెక్ట్స్) పోర్ట్‌ఫోలియోలను ఉంచుకున్నారు.

ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన తర్వాత బీజేపీతో  చేతులు కలిపి సీఎంగా ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణం తీసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు ఏడు వారాల తర్వాత ఈ పోర్ట్‌ఫోలియోల కేటాయింపు నిర్ణయం తీసుకున్నారు.

ఈ నెల 9వ తేదీన ఇద్దరుగా ఉన్న మహారాష్ట్ర క్యాబినెట్‌లోకి 18 మంది మంత్రులను తీసుకున్నారు. తాజాగా, వారికి పోర్ట్‌ఫోలియోలను కేటాయించారు. ఇందులో బీజేపీకి ప్రధానమైన పోర్ట్‌ఫోలియోలు దక్కాయి.

సీఎం కార్యాలయం ప్రకటన ప్రకారం, దేవేంద్ర ఫడ్నవీస్ ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ మినిస్ట్రీ, హోం మినిస్ట్రీ బాధ్యతలు తీసుకుంటున్నారు. లా అండ్ జస్టిస్, వాటర్ రీసోర్సెస్, హౌజింగ్, ఎనర్జీ పోర్ట్‌ఫోలియోను కూడా దేవేంద్ర ఫడ్నవీస్ చేతిలోనే ఉండనున్నాయి. బీజేపీ మంత్రి రాధాక్రిష్ణ విఖే పాటిల్ కొత్త రెవెన్యూ శాఖ బాధ్యతలు తీసుకున్నారు. బీజేపీ మంత్రి సుధీర్ ముంగంటివార్ అటవీ శాఖ పోర్ట్‌ఫోలియో పొందారు.

మహారాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ కొత్త ఉన్నత, సాంకేతిక విద్యా శాఖకు బాధ్యతలు తీసుకుంటారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కూడా బాధ్యులుగా ఉంటారు.

కాగా, ఏక్‌నాథ్ షిండే క్యాంపు నుంచి శివసేన రెబల్స్ దీపక్ కేసర్కర్ కొత్తగా పాఠశాల విద్యా శాఖకు, అబ్దుల్ సత్తార్ వ్యవసాయ శాఖకు బాధ్యతలు తీసుకుంటారు.

click me!