Maharashtra cabinet: 'మహా' మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌.. హోం మంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌!

By Rajesh KFirst Published Aug 7, 2022, 6:21 PM IST
Highlights

Maharashtra cabinet: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని కేబినెట్‌ను విస్తరించనున్నారు. దాదాపు 15 మంది ఎమ్మెల్యేల‌కు త‌న నూత‌న మంత్రివర్గంలోకి తీసుకునే అవ‌కాశం క‌నిపించ‌నున్నారు. ప్రధానంగా డిప్యూటీ సీఎంగా ఉన్న‌ దేవేంద్ర ఫడ్నవీస్‌కు హోంమంత్రి బాధ్యతలు అప్పగించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.   

Maharashtra cabinet: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మంత్రివర్గంలో విస్తరించనున్న‌ట్లు తెలుస్తుంది. ఈ విస్త‌ర‌ణ‌లో కీల‌క మార్పులు జ‌ర‌గ‌నున్నాయి. దాదాపు 15 మంది ఎమ్మెల్యేల‌ను మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉంటే.. డిప్యూటీ సీఎంగా  దేవేంద్ర ఫడ్నవీస్‌కు హోం శాఖ దక్కుతుందని భావిస్తున్నారు. అలాగే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ కూడా మంత్రివర్గంలో భాగం కానున్నారట‌. విస్తరణ అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చే ప్రక్రియ ప్రారంభం కానుంది.

మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో నేడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ తరుణంలో మహారాష్ట్ర కేబినెట్‌లో శాఖల పంపిణీకి సంబంధించి బీజేపీ హైకమాండ్‌లోని కొందరు నేతలతో సీఎం షిండే చర్చలు జరుపుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మంత్రుల జాబితా కూడా సిద్ధమైన‌ట్టు టాక్. 

సీఎం షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ల ప్రమాణ స్వీకారం జరిగి 35 రోజులకు పైగా గడిచినా మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరగలేదు. కేబినెట్ విస్తరణపై సీఎం షిండే, ఉప ముఖ్యమంత్రి ఢిల్లీలో బీజేపీ పెద్ద నేతలతో చర్చించే అవకాశం ఉందని సమాచారం.

మంత్రివర్గ విస్తరణలో జాప్యం వల్ల రాష్ట్ర ప్రభుత్వ పనికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని సీఎం షిండే శనివారం అన్నారు. మరికొంతమంది మంత్రులను త్వరలో చేర్చుకోనున్నారు. ఇదిలాఉంటే.. తిరుగుబాటు ఎమ్మెల్యేల సభ్యత్వం అంశం కూడా సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండ‌టంతో ఈ జాప్యం జ‌రిగిన‌ట్టు తెలుస్తుంది. 

శివసేనలో తిరుగుబాటు కారణంగా ఉద్ధవ్ ఠాక్రే సిఎం పదవికి రాజీనామా చేయడంతో జూన్ 30న ముఖ్యమంత్రిగా ఏకనాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర‌ ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంత‌రం ఇద్దరు స‌భ్యుల‌తో క్యాబినెట్ సాగింది. దీనిని ఎన్‌సిపి నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తో సహా ప్రతిపక్ష నాయకులు విమర్శించారు. విపక్షాల విమర్శలపై ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ.. అజిత్ పవార్ ప్రతిపక్ష నాయకుడని, అలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుందని అన్నారు. తాను ప్రభుత్వంలో ఉన్న తొలి 32 రోజుల్లో ఐదుగురు మంత్రులే ఉన్నారనే విషయం మరిచిపోయారనీ, త్వరలో మహారాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉండగా.. 2024 లోక్‌సభ ఎన్నికల ఎన్నికలపై దృష్టి పెట్టింది బీజేపీ. ప్రతిపక్ష పార్టీలు గెలుస్తున్న అసెంబ్లీ స్థానాలపై ఫోక‌స్ చేసింది. బీజేపీ తమ‌ ముద్రను వేసేందుకు స‌రికొత్త వ్యూహాల‌ను అనుస‌రిస్తుంది. వ‌చ్చే.. లోక్‌సభ ఎన్నికల్లో శివసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తాయని, ఆయా నియోజకవర్గాల్లోని సిట్టింగ్‌ లోక్‌సభ సభ్యుల గెలుపునకు బీజేపీ కృషి చేస్తుంద‌నే టాక్ వినిపిస్తుంది.  

click me!