
మత మార్పిడి నిరోధక ఆర్డినెన్స్‌కు మధ్య ప్రదేశ్ కేబినెట్ ఇవాళ ఆమోదం తెలిపింది. పెళ్లి ముసుగులో కానీ, మోసపూరితంగా రాతై ఎవరైనా మత మార్పిడికి పాల్పడితే ఈ ఆర్డినెన్స్ కింద పదేళ్ల జైలు శిక్ష విధిస్తారు.
‘మత స్వేచ్ఛ బిల్లు-2020’ పేరుతో తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఆమోదం కోసం పంపినట్టు రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా పేర్కొన్నారు. ‘‘సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన ఇవాళ జరిగిన వర్చువల్ కేబినెట్ మీటింగ్‌లో మత స్వేచ్ఛ ఆర్డినెన్స్ సహా పలు ఆర్డినెన్స్‌లను ఆమోదించడం జరిగింది...’’ అని ఆయన పేర్కొన్నారు.
కొవిడ్-19 కారణంగా అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడడంతో ఈ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టలేకపోయామని మంత్రి పేర్కొన్నారు.
ఇప్పటికే ఉత్తర ప్రదేశ్ లో ఈ ఆర్డినెన్స్ అమల్లో ఉంది. యూపీ మంత్రివర్గం నవంబర్ 24న చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ ఆర్డినెన్స్ - 2020కు ఆమోదం తెలిపింది. ఈ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆనందిబెన్ పటేల్ నవంబర్ 28న ఆమోదముద్ర వేశారు.
ఈ ఆర్డినెన్స్ ప్రవేశపెట్టిన నెలలోనే యూపీలో అనేక కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు యూపీ బాలోనే మధ్యప్రదేశ్ కూడా ఈ ఆర్డినెన్స్ ను అమల్లోకి తేబోతోంది.