షాకింగ్... జవాను సమాచారంతోనే పుల్వామా ఎటాక్

By telugu teamFirst Published May 17, 2019, 2:16 PM IST
Highlights

ఇటీవల పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని ఎవరూ మర్చిపోయి ఉండరు. ఉగ్రదాడిలో 40మందికి పైగా భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

ఇటీవల పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని ఎవరూ మర్చిపోయి ఉండరు. ఉగ్రదాడిలో 40మందికి పైగా భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు భారత ప్రభుత్వం ప్రతీకారం కూడా తీర్చుకుంది. అయితే.. పాకిస్థాన్ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడటానికి ఇండియన్ జవాన్ కారణమని తేలింది.

ఓ భారత సైనికుడు ఇచ్చిన సమాచారం మేరకు ఈ ఉగ్రదాడి జరిగినట్లు తేలింది. హానీ ట్రాప్‌లో చిక్కిన ఓ భారతసైనికుడు సీఆర్‌పీఎఫ్ కదలికల సమాచారం అందించి పుల్వామా దాడికి కారణమయ్యాడని మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌(ఏటీఎస్‌), కేంద్ర నిఘా సంస్థల దర్యాప్తులో తేలింది. సామాజిక మాధ్యమాల్లో పాక్ ఐఎస్ఐ వేసిన ఉచ్చులో భారత సైనికుడు అవినాష్ కుమార్ (25) చిక్కుకున్నాడు. 

స్నూఫింగ్ యాప్‌ ద్వారా ఓ అమ్మాయిలా మాట్లాడినట్టు జవానును మభ్యపెట్టి కీలక సమాచారాన్ని తెలుసుకున్నారని కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాల దర్యాప్తులో తెలిసింది. సీఆర్పీఎఫ్ బలగాల కదలికల సమాచారం అవినాష్ ఎప్ప‌టిక‌ప్పుడు అందజేశాడని, దీనివల్లే పుల్వామాలో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేయించి 40మందిని హతమార్చారని వెల్లడైంది.

click me!