భారత ఆర్మీ కొత్త చీఫ్ గా మనోజ్ పాండే నియామకం

Published : Apr 18, 2022, 06:57 PM ISTUpdated : Apr 18, 2022, 07:04 PM IST
భారత ఆర్మీ కొత్త చీఫ్ గా  మనోజ్ పాండే నియామకం

సారాంశం

భారత ఆర్మీ చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండేను సోమవారం నాడు ప్రభుత్వం నియమించింది. రక్షణ మంత్రిత్వశాఖ సోమవారం నాడు ఈ విషయాన్ని ప్రకటించింది.

న్యూఢిల్లీ: భారత ఆర్మీ చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ Manoj Pande ను సోమవారం నాడు నియమించారు. అత్యున్నత పదవికి పదోన్నతి పొందిన తొలి ఇంజనీర్ ఆయనే. ఈ నెల చివరి మాసంలో మనోజ్ పాండే బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం మనోజ్ పాండే Army వైస్ చీఫ్ గా కొనసాగుతున్నారు.  ఆర్మీ స్టాఫ్ తదుపరి చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండేను నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రక్షణ మంత్రిత్వశాఖ ఇవాళ ప్రకటించింది.

29వ ఆర్మీ చీఫ్‌గా మనోజ్ పాండే ఈనెలాఖరులో బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే తన 28 నెలల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుని ఈనెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో పాండే కొత్త ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపడతారు.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం