ట్రయాంగిల్ లవ్: పెళ్లి చేసుకోవాలంటూ ప్రియుడి పోస్టర్లు

Published : Dec 06, 2018, 09:50 AM IST
ట్రయాంగిల్ లవ్: పెళ్లి చేసుకోవాలంటూ ప్రియుడి పోస్టర్లు

సారాంశం

తనతో సహజీవనం చేస్తున్న ప్రియురాలు పెళ్లి చేసుకొనేందుకు అంగీకరించలేదనే కారణంగా తనను పెళ్లి చేసుకోవాలని కోరుతూ ఊరంతా పోస్టర్లు అంటించాడు ఓ ప్రియుడు


పూణె:తనతో సహజీవనం చేస్తున్న ప్రియురాలు పెళ్లి చేసుకొనేందుకు అంగీకరించలేదనే కారణంగా తనను పెళ్లి చేసుకోవాలని కోరుతూ ఊరంతా పోస్టర్లు అంటించాడు ఓ ప్రియుడు ఈ ఘటన మహారాష్ట్రలోని పూణెలో చోటు చేసుకొంది.

తాము కొంత కాలంగా సహ జీవనం చేస్తున్నామని ఆ పోస్టర్‌లో రాశారు.  తాము పెళ్లి కూడ చేసుకోవాలని భావించినట్టు చెప్పారు. అయితే మరింత డబ్బును కోరుకొంటున్న తన ప్రియురాలు  తనను వదిలేసి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని భావిస్తోందన్నారు.

తనను పెళ్లి చేసుకోవాలని  కోరుతూ ఆ యువకుడు ఊరంతా పోస్టర్లు  వేశారు. ఈ పోస్టర్లతో ఆ గ్రామమంతా ఈ విషయం తెలిసింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోస్టర్లను  పోలీసులు  తగిలించారు. 

పోస్టర్లు అంటించిన యువకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ పోస్టర్ల కారణంగా తమ కుటుంబం పరువు పోయిందని  బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది.

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !