కళ్లెదుటే ప్రియురాలి గ్యాంగ్‌రేప్... ప్రియుడి ఆత్మహత్య

Published : Sep 14, 2018, 09:17 AM ISTUpdated : Sep 19, 2018, 09:25 AM IST
కళ్లెదుటే ప్రియురాలి గ్యాంగ్‌రేప్... ప్రియుడి ఆత్మహత్య

సారాంశం

తన కళ్లేదుటే ప్రేమించిన అమ్మాయి దారుణంగా గ్యాంగ్‌రేప్‌కు గురికావడంతో మనస్తాపం చెందిన ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

తన కళ్లేదుటే ప్రేమించిన అమ్మాయి దారుణంగా గ్యాంగ్‌రేప్‌కు గురికావడంతో మనస్తాపం చెందిన ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లా కటోఘోరో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన సవాన్  సాయి, అదే గ్రామానికి చెందిన యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

అయితే రెండు రోజుల క్రితం సాయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ప్రియురాలిని విచారణ నిమిత్తం పోలీసులు ప్రశ్నించగా దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 1 సాయంత్రం తాను, సాయి ఓ పాఠశాల వద్ద కూర్చొన్నామని... ఆ సమయంలో ఈశ్వర్ దాస్, ఖేమ్ కన్వర్ అనే ఇద్దరు యువకులు వచ్చి సాయితో గొడవ పడ్డారని వివరించింది.

అనంతరం సాయి కళ్లెదుటే తనపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది. ఈ సంఘటన గురించి సదరు యువకులు గ్రామంలోని కొందరికి చెప్పారు... దీనిని అవమానంగా భావించిన సాయి ఆత్మహత్యకు పాల్పడి వుండవచ్చని యువతి తెలిపింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అత్యాచారానికి పాల్పడిన యువకులను అదుపులోకి తీసుకున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే