ప్రేమికులు జంప్: అబ్బాయి తల్లిని చెట్టుకు కట్టేసిన.. అమ్మాయి తండ్రి

Siva Kodati |  
Published : Jul 21, 2019, 12:53 PM IST
ప్రేమికులు జంప్: అబ్బాయి తల్లిని చెట్టుకు కట్టేసిన.. అమ్మాయి తండ్రి

సారాంశం

తమ పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోరని భావించిన ప్రేమజంట ఇళ్లు విడిచి పారిపోయారు. దీంతో అబ్బాయి తల్లిని అమ్మాయి తండ్రి చెట్టుకు కట్టేసి చిత్రహింసలకు గురిచేశాడు.

తమిళనాడులో దారుణం జరిగింది. ప్రేమ వివాహం ఇష్టం లేకపోవడంతో ప్రియురాలి తండ్రి ప్రేమికుడి తల్లిని స్తంభానికి కట్టేసి చిత్రహింసలకు గురిచేశాడు.

వివరాల్లోకి వెళితే... తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లా విరుదాచలం సమీపంలోని విలాంగట్టూరు గ్రామానికి చెందిన పొన్నుసామి భార్య సెల్వి ... ఈమె కుమారుడికి అదే ప్రాంతానికి చెందిన బంధువు కొలుంజి కుమార్తెతో పరిచయం ఏర్పడి.. అది ప్రేమగా మారింది.

తమ పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకోవని భావించిన వారిద్దరూ ఇల్లు విడిచి పారిపోయారు. దీంతో ఇరు కుటుంబాలు రోడ్డుపైకి వచ్చి వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం సెల్వి ఇంటి ముందు నిలుచుని ఉంది.

ఆ సమయంలో కొలుంజి అక్కడికి వచ్చి.. నా బిడ్డను ఎక్కడ ఉంచారో చెప్పు..!!! అంటూ ఆమెను అసభ్యపదజాలంతో దూషించాడు. అక్కడితో ఆగకుండా సెల్విని స్తంభానికి కట్టేసి చిత్రహింసలకు గురిచేశాడు.

స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సెల్విని రక్షించి విరుదాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కొలుంజిని అరెస్ట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

అధికారులను పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్ | CM Joseph Vijay Distributes Ration to Families
తమిళనాడులో విద్యుత్ బస్ స్టేషన్ లను పరిశీలించిన సీఎం విజయ్ | CM Vijay Inspects EV MTC Bus Depo