ప్రేమను ఇంట్లో ఒప్పుకోలేదని.. నాలుగు సార్లు పారిపోయి, ఎలుకల మందు తిని ప్రేమజంట ఆత్మహత్యాయత్నం..

Published : Nov 03, 2022, 11:25 AM IST
ప్రేమను ఇంట్లో ఒప్పుకోలేదని.. నాలుగు సార్లు పారిపోయి, ఎలుకల మందు తిని ప్రేమజంట ఆత్మహత్యాయత్నం..

సారాంశం

తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోలేదని మనస్తాపంతో ఓ ప్రేమజంట ఎలుకలమందు తిని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంట్లో ప్రియురాలు మరణించగా, ప్రియుడి పరిస్థితి విషమంగా ఉంది 

చెన్నై : తల్లిదండ్రులు విడదీస్తారేమోనన్న భయంతో ప్రేమజంట విషం తాగి, ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సూలగిరి సమీపంలో చోటుచేసుకుంది. వీరిలో ప్రియురాలు మృతి చెందగా, ప్రియుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పోలీసుల కథనం మేరకు.. కర్ణాటక రాష్ట్రం పోలార్ జిల్లా వేమక్కల్ ప్రాంతానికి చెందిన ఆనందన్ కుమార్తె అనుశ్రీ (14) అదే ప్రాంతంలో ఉన్న పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. కృష్ణగిరి జిల్లా సూలగిరి సమీపంలో ఉన్న ఏరండపల్లి గ్రామానికి చెందిన సౌందరరాజ్ (22) వీరికి బంధువు. 

ఈ క్రమంలో వీరిద్దరూ ప్రేమించుకున్నారు. వారి ప్రేమ విషయం తల్లిదండ్రులకు తెలిసింది. వయసు తేడా చాలా ఉండడంతో పాటు వేరే కారణాలతో వారు.. వీరిద్దరి ప్రేమను వ్యతిరేకించారు. ఈ క్రమంలో వీరిద్దరూ మూడుసార్లు ఇంటి నుంచి పారిపోయారు. అయితే తల్లిదండ్రులు, బంధువులు ప్రేమజంటను   తిరిగి ఇళ్లకు తీసుకు వచ్చారు. ఈ క్రమంలో నాలుగోసారి  సౌందరరాజ్, అనుశ్రీ  ఇంటి నుంచి పారిపోయారు. ఈ విషయమై  ఆనందన్ వేమక్కల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.

వివాహేతర సంబంధం.. అడ్డుగా ఉన్నాడని కన్న కొడుకునే చంపేసిన తల్లి...

తన కుమార్తెను సౌందరరాజ్ కిడ్నాప్ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి, ప్రేమ జంట కోసం గాలించారు. విషక్ష్ం తెలుసుకున్న సౌందరరాజ్, అనుశ్రీ తమను తల్లిదండ్రులు విడదీస్తారని భావించి.. ఎలకల మందు పేస్టు చేసుకుని తిని, సూలగిరి వద్ద స్పృహ తప్పి పడిపోయారు. స్థానికులు వారిని గుర్తించి, క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అను శ్రీ బుధవారం మృతి చెందింది. సౌందరరాజ్ పరిస్థితి విషమంగా ఉంది.  అతడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయమై సూలగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Jagannath Puri Rath Yatra 2026: కదలనున్న జగన్నాథ రథ చక్రాలు | Lord Jagannath Darshan
Indian Population in USA: అమెరికాలో ఇండియన్స్ అడ్డా.. ఈ 5 నగరాల్లోనే ఎక్కువ మంది.. ఎందుకో తెలుసా?