Lok Sabha Election Schedule 2024 : లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ఇదే...

By Arun Kumar P  |  First Published Mar 16, 2024, 3:52 PM IST

దేశంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది.  లోక్ సభ ఎన్నికలతో పాటు పలురష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు ఎన్నికలు ఎన్ని విడతల్లో జరగనున్నాయంటే... 


న్యూడిల్లీ : దేశవ్యాప్తంగా ఎన్నికల పండగకు తెరలేచింది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసి) విడుదల చేసింది. దేశంలోని అన్ని లోక్ సభ స్థానాలతో పాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఈసి షెడ్యూల్ ప్రకటించింది. ఎలక్షన్ నోటిఫికేషన్ వెలువడటంతో దేశవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది.  

దేశవ్యాప్తంగా 545 లోక్ సభ సీట్లుండగా 543 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ  అన్ని లోక్ సభ స్థానాలకు ఒకేసారి కాకుండా విడతలవారిగా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ ఆరంభం నుండి మే చివరివారం వరకు  ఈ ఎన్నికలు జరగనున్నాయి. 

Latest Videos

ఆంధ్ర ప్రదేశ్ తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, ఒడిషా, సిక్కిం  రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కూడా పార్లమెంట్ ఎన్నికలతో పాటే షెడ్యూల్ విడుదల చేసింది ఎన్నికల సంఘం.  

దేశంలో సుమారు 97 కోట్ల  మంది ఓటర్లు వున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమీషనర్ ప్రకటించారు,. ఇందులో కోటి  82 లక్షల మంది యంగ్ ఓటర్లు వున్నారని... వీరు ఈసారే ఓటుహక్కును పొందినట్లు తెలిపారు. 10.5 లక్షల పొలింగ్ స్టేషన్లు దేశవ్యాప్తంగా వున్నట్లు తెలిపారు. పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఎన్నికల్లో పాల్గొంటున్నట్లు సిఈసి వెల్లడించారు. 49 కోట్ల మంది పురుష, 47 కోట్ల మంది మహిళా ఓటర్లు దేశవ్యాప్తంగా వున్నట్లు రాజీవ్ కుమార్ తెలిపారు.  

ఏడు విడతల్లో ఎన్నికలు : 

మొదటి విడత :  మార్చ్ 20, 2024 న నోటిఫికేషన్... నామినేషన్ల  గడువు 27, 28 మార్చ్.... స్క్రూటినీ 28, 30 తేధీల్లో... నామినేషన్ల ఉపసంహరణ చివరితేదీ 30 మార్చ్, 02 ఏప్రిల్.... 19న పోలింగ్

రెండవ విడత : మార్చి 28, 2014 నోటిఫికేషన్ ... నామినేషన్ల దాఖలుకు చివరితేదీ ఏప్రిలో 4.... నామినేషన్లు స్రూటినీ ఏప్రిల్ 05 (జమ్మూ కాశ్మీర్ లో ఏప్రిల్ 06)... నామినేషన్ల ఉపసంహరణ ఏప్రిల్ 08... ఎన్నికలు ఏప్రిల్ 26న... ఈ దశలో 21 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 

మూడవ విడత ; ఏప్రిల్ 12న నోటిఫికేషన్... నామినేషన్ల  గడువు ఏప్రిల్ 19.... నామినేషన్ల స్క్రూటినీ ఏప్రిల్ 20  తేధీల్లో... నామినేషన్ల ఉపసంహరణ చివరితేదీ ఏప్రిల్ 22... మే 7 న పోలింగ్... 12 రాష్ట్రాలో ఎన్నికలు...   రాజస్థాన్, తమిళనాడు, కేరళ, గుజరాత్, నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో

నాలుగో విడత : ఏప్రిల్ 18న నోటిఫికేషన్... నామినేషన్ల  గడువు ఏప్రిల్ 25.... నామినేషన్ల స్క్రూటినీ ఏప్రిల్ 26  తేధీల్లో... నామినేషన్ల ఉపసంహరణ చివరితేదీ ఏప్రిల్ 29... మే 13 న పోలింగ్ ...  తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ఈ ఫేజ్ లోనే 

ఐదవ విడత ;ఏప్రిల్ 26న నోటిఫికేషన్... నామినేషన్ల  గడువు మే 03.... నామినేషన్ల స్క్రూటినీ మే 04  ... నామినేషన్ల ఉపసంహరణ చివరితేదీ మే 06... మే 20 న పోలింగ్  

ఆరో విడత : ఏప్రిల్ 29న నోటిఫికేషన్... నామినేషన్ల  గడువు మే 06.... నామినేషన్ల స్క్రూటినీ మే 07  ... నామినేషన్ల ఉపసంహరణ చివరితేదీ మే 09...మే 25 న పోలింగ్   

ఏడో విడత : 
మే 07న నోటిఫికేషన్... నామినేషన్ల  గడువు మే 14.... నామినేషన్ల స్క్రూటినీ మే 15 ... నామినేషన్ల ఉపసంహరణ చివరితేదీ మే 17...జూన్ 1 న పోలింగ్ 

అన్ని లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల కౌటింగ్ మరియు రిజల్ట్  : జూన్ 4న వుంటుంది. 


 

click me!