లాక్ డౌన్ తో ఇంట్లోనే భర్తలు.. భార్యలకు చిత్రహింసలు

By telugu news teamFirst Published Apr 1, 2020, 7:55 AM IST
Highlights

లాక్ డౌన్ తో కార్యాలయాలు, పనులు బంద్ కావడంతో పురుషులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఆ సమయంలో... తమ అసహనాన్ని మొత్తం భార్యలపై చూపిస్తుండటం గమనార్హం. గత పది రోజులకు గృహ హింసలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
 

కరోనా మహమ్మారి నుంచి దేశాన్ని రక్షించేందుకు దేశ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో ఎక్కడివారు అక్కడే ఇంట్లోనే ఉండిపోయారు. ఈ లాక్ డౌన్ నుంచి చాలా మంది మహిళలు కరోనా బారి నుంచి బయటపడినా... గృహ హింస నుంచి మాత్రం తప్పించుకోలేకపోతున్నారు.

లాక్ డౌన్ తో కార్యాలయాలు, పనులు బంద్ కావడంతో పురుషులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఆ సమయంలో... తమ అసహనాన్ని మొత్తం భార్యలపై చూపిస్తుండటం గమనార్హం. గత పది రోజులకు గృహ హింసలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

Also Read డిల్లీలో కరోనా కలకలం... మర్కజ్ నిజాముద్దిన్ పెద్దలపై చర్యలు...

మార్చి 24వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి వారం వ్యవధిలో జాతీయ మహిళా కమిషన్ కి మొత్తం 58 గృహ హింస కు సంబంధించి ఫిర్యాదులు అందడం గమనార్హం. వీటిలో ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చాయి. ముఖ్యంగా పంజాబ్ నుంచి ఎక్కువగా వచ్చాయని అధికారులు చెబుతున్నారు. 

ఇదిలా ఉండగా.. దేశంలో కరోనా కోరలుచాపుతోంది. డిచిన 24 గంటల్లో 227 కరోనా పాజిటివ్ కొత్త కేసులు నమోదైనట్టుగా మంగళవారం నాడు ప్రకటించింది. దేశంలో మొత్తం కరోనా కేసులు 1251కు చేరుకొన్నాయి.కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నవారిలో 32 మంది మృతి చెందితే, మరో 102 మందికి నయమైనట్టుగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. 

ఢిల్లీ ఈవెంట్ కారణంగానే దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా కేంద్రం ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలో 25 కొత్త కేసులు నమోదైనట్టుగా కేంద్రం ప్రకటించింది.దీంతో ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 97కు చేరినట్టుగా అధికారులు ప్రకటించారు. 

లోకల్ ట్రాన్స్ మిషన్ స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనాపై నర్సులకు కూడ చికిత్స విషయంలో శిక్షణ ఇవ్వనున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఆన్ లైన్ లో నర్సులకు నర్సులకు ఈ శిక్షణ ఇస్తామని తేల్చి చెప్పింది. దక్షిణ కొరియా, టర్కీ, వియత్నాంల నుండి వైద్య పరికరాలను తీసుకొస్తున్నట్టుగా కేంద్రం తెలిపింది. మాస్కులు, శానిటైజర్లకు కొరత లేకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొందని కేంద్రం ప్రకటించింది.

కరోనాా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను రైల్వే శాఖ కూడ ముందుకు వచ్చింది. సుమారు 20 వేల రైల్వే కోచ్‌లను ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చేందుకు ముందుకు వచ్చింది.ప్రపంచంలో ఇవాళ్టికి 7,88, 522 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధితో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 37,878 మంది మృతి చెందినట్టుగా సమాచారం. మరో వైపు ఈ వ్యాధి సోకిన వారిలో 1,66,768 మంది రికవరీ అయినట్టుగా అధికారవర్గాలు ప్రకటించాయి.

click me!