తండ్రి కోసం చొక్కా కుట్టిన చిన్నారి.. నెటిజన్లు ఫిదా..!

Published : Apr 01, 2023, 11:36 AM IST
తండ్రి కోసం చొక్కా కుట్టిన చిన్నారి.. నెటిజన్లు ఫిదా..!

సారాంశం

వేరేవారి సహాయం తీసుకొని దానిని పూర్తి చేసినట్లు చెప్పాడు. చాలా వరకు షర్ట్ తానే కుట్టానని.. కొంత సహాయం తీసుకున్నానని చెప్పాడు.

సోషల్ మీడియాలో ప్రతిరోజూ కొన్ని ఎన్నో రకాల వీడియోలు వస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని మనుసుకు హత్తుకునేలా ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఓ చిన్నారి తన తండ్రికి చొక్కా కుట్టాడు. అది చూసి ఆ తండ్రి ఆనందంతో పొంగిపోయాడు. ఆయన తండ్రి మాత్రమే కాదు.. నెటిజన్లు కూడా ఫిదా అయిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే...


ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను ఆరోన్ గౌవేయా అనే వ్యక్తి... ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. క్లిప్ సామ్ అనే బాలుడు షర్ట్ పట్టుకొని... తన తండ్రి గదిలోకి వెళ్లాడు. ఆ తర్వాత.. తాను తన తండ్రి కోసం షర్ట్ కుట్టానంటూ... ఆ షర్ట్ చూపించాడు. షర్ట్ మొత్తం తాను కుట్టలేదని.. వేరేవారి సహాయం తీసుకొని దానిని పూర్తి చేసినట్లు చెప్పాడు. చాలా వరకు షర్ట్ తానే కుట్టానని.. కొంత సహాయం తీసుకున్నానని చెప్పాడు. ఆ షర్ట్ చూసి తండ్రి చాలా ఆనంద పడ్డాడు.వెంటనే దానిని వేసుకున్నాడు కూడా. ఆ షర్ట్ కాలర్ చాలా భిన్నంగా ఉందని.. తనకు నచ్చిందని చెప్పాడు. అయితే... షర్ట్ జీన్స్ మీదకు సెట్ అవ్వదని.. ఫార్మల్ కింద వేసుకుంటానని అతని తండ్రి చెప్పాడు. ఈ వీడియోని ఆ తండ్రి ఎంతో సంతోషంగా నెట్టింట షేర్ చేసుకున్నాడు. నెటిజన్లు సైతం తండ్రిపై కొడుకు చూపించిన ప్రేమకు ఫిదా అయిపోతున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

జపాన్ ప్రధాని కి భారత్ స్టైల్ ల్లో అదిరిపోయే వెల్ కమ్ | PM Modi Welcomes Japanese PM Sanae Takaichi
మోదీ పవర్ ఫుల్ స్పీచ్ కి జపాన్ ప్రధాని ఫిదా: PM Modi Speech Impresses Japan PM | Asianet News Telugu