పాపం పెళ్లి కూతురు.. ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యింది..!

Published : Apr 01, 2023, 10:50 AM IST
 పాపం పెళ్లి కూతురు.. ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యింది..!

సారాంశం

పెళ్లిలో వధూవరులకు తుపాకీలను చేతిలో పట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అయితే... అది కాస్త బెడిసి కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.  

భారతీయ వివాహాల్లో  చాలా సంప్రదాయాలు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కో సంప్రదాయాన్ని ఫాలో అవుతూ ఉంటారు. కొన్ని సంప్రదాయాలు అందరూ ఆకట్టుకునేలా ఉంటే... కొన్ని సంప్రదాయాలు బాబోయ్ ఇలాంటి మళ్లీ ప్రయత్నించకూడదు అనేలా ఉంటాయి. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది. పెళ్లిలో వధూవరులకు తుపాకీలను చేతిలో పట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అయితే... అది కాస్త బెడిసి కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

 

ఈ వీడియోకి అదితి అనే మహిళ ఈ వీడియోని నెట్టింట షేర్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది. ఈ . 13 సెకన్ల క్లిప్‌లో, వధూవరులు వేదికపై ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు. ఆ జంట చేతిలో మెరుపులుు వచ్చే తుపాకులు ఉన్నాయి. వారు తుపాకీ బటన్ నొక్కినప్పుడు అందులో నుంచి క్రాకర్స్ వస్తూ ఉంటాయి. అయితే... వధువు తుపాకీ నొక్కినప్పుడు.. అది మిస్ ఫైయిర్ అయ్యి.. అది కాస్త పేలింది. ఆమె ముఖానికి తగిలింది. ఈ వీడియో చూసినవారంతా.. అయ్యో పాపం వధువు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె పై జాలి పడుతున్నారు. మీరు కూడా వీడియో పై లుక్కేయండి.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

జపాన్ ప్రధాని కి భారత్ స్టైల్ ల్లో అదిరిపోయే వెల్ కమ్ | PM Modi Welcomes Japanese PM Sanae Takaichi
మోదీ పవర్ ఫుల్ స్పీచ్ కి జపాన్ ప్రధాని ఫిదా: PM Modi Speech Impresses Japan PM | Asianet News Telugu