విషాదం : మేకను తప్పించబోయి.. సింహం నోటికి చిక్కి యువకుడు బలి..

Published : May 08, 2021, 05:08 PM IST
విషాదం : మేకను తప్పించబోయి.. సింహం నోటికి చిక్కి యువకుడు బలి..

సారాంశం

గుజరాత్ లో దారుణం జరిగింది. మేకను తప్పించబోయి, ఓ యువకుడు సింహానికి బలయ్యాడు. బహదూర్‌భాయ్‌ జీవాభాయ్‌ అనే వ్యక్తి మామిడి తోట దగ్గర కాపు కాస్తుండగా హఠాత్తుగా సింహం వచ్చింది.  

గుజరాత్ లో దారుణం జరిగింది. మేకను తప్పించబోయి, ఓ యువకుడు సింహానికి బలయ్యాడు. బహదూర్‌భాయ్‌ జీవాభాయ్‌ అనే వ్యక్తి మామిడి తోట దగ్గర కాపు కాస్తుండగా హఠాత్తుగా సింహం వచ్చింది.

 ఆ సింహం మేకను తినడానికి ప్రయత్నించగా అతను మేకను తప్పించాడు. అయితే సింహం మేకను కాదని ఆ వ్యక్తిని తన ఆహారంగా చేసుకుని తినేసింది. అలా సింహం పంజాకు మనిషి బలైన ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

 జునాగఢ్ జిల్లా గిర్‌ అటవీ డివిజన్ లోని తలాలా రేంజ్ పరిధిలో ఉన్న మధుపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. మధుపూర్ గ్రామం సమీపంలోని మామిడి తోటకు కావలికి వెళ్లాడు. అయితే శనివారం తెల్లవారుజామున అడవిలో నుంచి సింహం బయటకు వచ్చింది.

తోట సమీపంలోకి రాగానే దానికి మేక కనిపించింది. మంచానికి కట్టేసిన మేకను తినేయాలని చూసింది. ఇంతలో దాని అరుపులకు జీవాభాయ్ మేల్కొన్నాడు. సింహం నుంచి మేకను తప్పించాడు. మేక తప్పించుకోగా జీవాభాయ్ సింహానికి చిక్కాడు.

సింహం పంజా విసిరి జీవాభాయ్‌పైకి దాడిచేసి తినేసింది. అతని అరుపులు విన్న గ్రామస్థులు వెంటనే తోట దగ్గరకు చేరుకున్నారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి సింహాన్ని బంధించారు. 
 
PREV
click me!

Recommended Stories

PM Modi: మోదీ నా బిడ్డకు పునర్జన్మనిచ్చారు.. ప్రధానిని దూషించిన బాలిక తల్లి ఎమోషన్
భోగాపురం పర్యటనలో మోదీ సెక్యూరిటీ చూశారా | PM Modi High-Level Security at Bhogapuram Airport