అంత అబద్ధమే.. పాకిస్తాన్ పై మండిపడ్డ భారత్

By telugu news teamFirst Published Sep 26, 2020, 11:17 AM IST
Highlights

ఆ ప్రాంతం భారత అంతర్భాగంలోనిదేనని భారత్ మరోసారి పేర్కొంది. కాశ్మీర్ లో మానవ హక్కులను కాలరాస్తున్నారన్న ఇమ్రాన్ కాన్ విమర్శలను భారత్ ఖండిచింది. పాక్ ఆరోపణలన్నీ పచ్చి అబ్ధాలుగా పేర్కొంది.


పాకిస్తాన్ పై భారత్ మరోసారి మండిపడింది.  ఐరాస 75వ సర్వప్రతినిధి సభలో పాకిస్తాన్ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంపై భారత్ మండిపడింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్లయకు సమాధానమిచ్చే హక్కును తమకు ఇవ్వాలని  కోరిన ఇండియా-కశ్మీర్ అంశం ముమ్మాటికీ భారత అంతరంగిక  వ్యవహారాల పరిధిలోకే వస్తుందని స్ఫష్టం చేసింది.

ఆ ప్రాంతం భారత అంతర్భాగంలోనిదేనని భారత్ మరోసారి పేర్కొంది. కాశ్మీర్ లో మానవ హక్కులను కాలరాస్తున్నారన్న ఇమ్రాన్ కాన్ విమర్శలను భారత్ ఖండిచింది. పాక్ ఆరోపణలన్నీ పచ్చి అబ్ధాలుగా పేర్కొంది. ఈ అంశానికి శాంతియుత పరిష్కారం కావాలని అంతకముందు ఇమ్రాన్ అన్నారు. కాగా ఈ వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తూ హాలు నుంచి ఇండియన్ డెలిగేట్ మిజిటో వినిటో వాకౌట్ చేశారు. 

Watch: India exercises its right of reply at the pic.twitter.com/fT4TJekpuW

— India at UN, NY (@IndiaUNNewYork)

 

click me!