కేర‌ళ‌లో ముస్లిం బాలికకు జ‌రిగిన అవ‌మానంపై నాయ‌కుల‌ మౌనం సిగ్గు చేటు - కేంద్ర మంత్రి వి.మురళీధరన్

Published : May 13, 2022, 11:39 AM IST
కేర‌ళ‌లో ముస్లిం బాలికకు జ‌రిగిన అవ‌మానంపై నాయ‌కుల‌ మౌనం సిగ్గు చేటు - కేంద్ర మంత్రి వి.మురళీధరన్

సారాంశం

కేరళలలో అవార్డు తీసుకోవడానికి ఓ ముస్లిం బాలికను వేధికపైకి పిలిచి అవమానించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై కేంద్ర మంత్రి వి.మురళీధరన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేరళ అధికార ప్రతిక్షాలు మౌనంగా ఉండటం సరైంది కాదని అన్నారు. 

కేర‌ళ‌లో వేదికపై ముస్లిం విద్యార్థినిని అవమానించిన ఘటనపై కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ స్పందించారు. దీనిని ఆయ‌న తీవ్రంగా ఖండించారు. ఈ విషయంపై అధికార, ప్రతిపక్ష పార్టీలు మౌనంగా ఉన్నాయని మురళీధరన్ విమర్శించారు.

‘‘ మలప్పురంలో వేదికపై ఓ ముస్లిం బాలికను అవమానించారు. ఈ అంశంపై ప్రతిపక్షాలు, పాలకపక్షం మౌనం వహించడం కేరళకు సిగ్గుచేటు. రాజ్యాంగ విలువలను నిలబెట్టే బాధ్యత, కర్తవ్యం ఆయనకు ఉంది. ఒక అమ్మాయిని బహిరంగంగా అవమానించినప్పుడు, ఆయ‌న ఎందుకు మౌనంగా ఉంటున్నారు.’’ అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు.

Minor Rape In Rajasthan: 12 ఏండ్ల బాలిక‌పై ప‌లువురు అత్యాచారం.. డబ్బుు కోసం సొంత తాతయ్యనే...

అంతకు ముందు కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఈ ఘ‌ట‌న‌పై స్పందిస్తూ.. ఈ కేసులో ‘‘ఎలాంటి కాగ్నిజెన్స్ తీసుకోలేదు’’ అని నిరాశ వ్యక్తం చేశారు. ‘‘ దీని గురించి మాట్లాడి ఉంటే నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరూ మాట్లాడకపోవడం ఆశ్చర్యంగా ఉంది ’’ అని గవర్నర్ అన్నారు. ‘‘ మనం మన కూతుళ్లను మత పెద్దల ముసుగు వేసుకుని, మహిళల పట్ల వివక్ష చూపుతున్న వ్యక్తుల ఇష్టాలకు వదిలేస్తామా. మన కుమార్తెలు అవమానాలు ఎదుర్కొంటున్నప్పుడు మౌనంగా ఉండటాన్ని నేను పాపంగా భావిస్తున్నాను ’’ అని ఆయన ఆవేదన వ్య‌క్తం చేశారు. 

Raipur Helicopter Crash: ల్యాండింగ్ సమయంలో కుప్ప‌ కూలిన హెలికాప్టర్.. ఇద్దరు పైలట్ల మృతి

ఇటీవల మలప్పురం జిల్లాలో మదర్సా భవన ప్రారంభోత్సవం సందర్భంగా విద్యార్థులను సత్కరించిన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) నాయకుడు పానక్కడ్ సయ్యద్ అబ్బాస్ అలీ షిహాబ్ తంగల్ బాలికకు జ్ఞాపికను అందజేశారు. అవార్డు ప్రదానం చేసిన వెంటనే, ముస్లిం పండితుడు MT అబ్దుల్లా ముసలియార్, అమ్మాయిని వేదికపైకి ఎందుకు ఆహ్వానించారని నిర్వాహకులను అడిగారు. ఆయ‌న నిర్వాహకులతో ఆగ్ర‌హంతో మాట్ల‌డుతూ.. “పదో తరగతి అమ్మాయిని వేదికపైకి ఎవరు ఆహ్వానించారు? మీకు సమస్తా నియమాలు తెలియదా? అమ్మాయిలను వేదికపైకి పిలవకండి ! దానికి బదులు ఆమె తల్లిదండ్రులను పిలవండి. మేం ఇక్కడ కూర్చున్నప్పుడు ఇలాంటి పనులు చేయకండి. ఇదంతా మీడియాలో క‌నిపిస్తుంది. టెలికాస్ట్ అవుతుంది ’’ అని అన్నారు. అయితే ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో వైర‌ల్ అయ్యింది. 

విదేశీ బాలికపై స్విమ్మింగ్ పూల్ లో, రిసార్ట్ గదిలో అత్యాచారం.. గోవాలో దారుణం...

ఈ ఘటనపై కేరళ బాలల హక్కుల కమిషన్ స్పందించింది. దీనిని సుమోటోగా కేసు నమోదు చేసింది. ఈ మేర‌కు బాలల హక్కుల కమిషన్ కార్యదర్శి నుండి ప్రకటన వెలువ‌డింది. మలప్పురంలో జరిగిన సంఘటనపై పెరింతల్మన్న SHO, జిల్లా బాలల సంరక్షణ అధికారి వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆదేశించింది.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం