పోలీసు వాహనాలకు నిప్పు, లాయర్లపై పోలీసుల కాల్పులు..

By telugu teamFirst Published Nov 2, 2019, 6:13 PM IST
Highlights

లాయర్లకు పోలీసులకు మధ్య పార్కింగ్ కు సంబంధించి చెలరేగిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. లాయర్లు పోలీసుల వాహనాలకు నిప్పంటించగా పోలీసులు వారిపై కాల్పులు జరిపారు.  

పార్కింగ్ కారణంగా చెలరేగిన వివాదం చిలికి చిలికి గాలివానగా మరి కాల్పులకు దారితీసింది. వివరాల్లోకెళితే ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు ప్రాంగణం లో చిన్నసైజ్ మినీ సంగ్రామమే నడిచింది. పార్కింగ్ విషయంలో లాయర్లకు పోలీసులకు మధ్య వివాదం తలెత్తింది. దీనితో కోపంతోని ఊగిపోయిన లాయర్లు అక్కడ పార్క్ చేసి ఉంచిన పోలీసుల వాహనాలకు నిప్పు పెట్టారు. 

తమ వాహనాలకు నిప్పు పెట్టడంతో పోలీసులు కాల్పులకు దిగారు. ఇద్దరు లాయర్లకు గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. 

వాహనాలకు నిప్పు పెట్టడంతో ఆత్మరక్షణలో కాల్చామని పోలీసులంటుండగా తొలుత పోలీసులు కాల్పులు జరపడం వల్లనే తాము వాహనాలకు నిప్పు పెట్టమని లాయర్లు ఆరోపిస్తున్నారు.

కోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. కోర్టు గేట్లకు తాళాలు వేశారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులను ఇద్దరు ఐపీఎస్ అధికారులు సమీక్షిస్తున్నట్టు సమాచారం. 

పూర్తి సమాచారం ఇంకా అందాల్సి ఉంది.  

click me!