ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీలను లీడ్ చేస్తున్న భారత సంతతి వివరాలు..!

By Mahesh KFirst Published Sep 2, 2022, 1:17 PM IST
Highlights

దిగ్గజ కాఫీ సంస్థ స్టార్‌బక్స్ సీఈవోగా భారత సంతతి వ్యక్తి లక్మణ్ నరసింహన్ సారథ్యం వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న భారత సంతతి వ్యక్తుల వివరాలు చూద్దాం.

న్యూఢిల్లీ: కాఫీ దిగ్గజం స్టార్‌బక్స్ కంపెనీకి భారత సంతతి లక్ష్మణ్ నరసింహన్ సారథ్యం
వహించనున్నారు. ఈ సంస్థకు కొత్త సీఈవోగా ఎంపికయ్యారు. ఈ తరుణంలోనే ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీలను లీడ్ చేస్తున్న భారత సంతతి వివరాలు, ఆ కంపెనీల వివరాలపై ఆసక్తి ఏర్పడింది. ఆ వివరాలు సంక్షిప్తంగా చూద్దాం.

లక్ష్మణ్ నరసింహన్:
55 ఏళ్ల నరసింహన్ యూకేకు చెందిన రెక్కిట్ బెంకిసర్ సీఈవోగా పని చేశాడు. ఇది కన్జ్యూమర్ హెల్త్, హైజీన్, న్యూట్రిషన్ కంపెనీ. ఈ ఏడాది అక్టోబర్ 1న ఆయన స్టార్‌బక్స్‌లో జాయిన్ కాబోతున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీన కంపెనీ బోర్డులో చేరడానికి ముందు ఆయన తాత్కాలిక సీఈవో హొవార్డ్ షల్జ్‌తో కలిసి పని చేస్తారని స్టార్‌బక్స్ కంపెనీ వెల్లడించింది.

లీనా నాయర్: 
యునిలివర్ సంస్థలో పిన్న వయస్సులోనే చీఫ్ హ్యూమన్ రీసోర్సెస్ ఆఫీసర్‌గా పని చేసిన లీనా నాయర్ గతేడాది డిసెంబర్ రాజీనామా చేశారు. ఫ్రెంచ్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ ఫ్యాషన్ హౌజ్ చానెల్‌లో చేరారు. ఈ ఏడాది జనవరిలో చానెల్ గ్లోబల్ సీఈవోగా బాధ్యతలు తీసుకున్నారు. జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ఆమె చదివారు. 

పరాగ్ అగర్వాల్:
ట్విట్టర్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్‌గా పని చేసిన పరాగ్ అగర్వాల్‌ను ఆ కంపెనీ నవంబర్ 2021లో సీఈవోగా ఉద్యోగోన్నతి కల్పించింది. సంస్థ సహవ్యవస్థాపకుడు, అప్పటి సీఈవో జాక్ డోర్సీ తన తర్వాతి సీఈవోగా పరాగ్ అగర్వాల్‌ను ఎంచుకున్నారు.

సందీప్ కటారియా:
2021లో సందీప్ కటారియా బాటా సంస్థ గ్లోబల్ సీఈవోగా ప్రమోషన్ పొందారు. 126 ఏళ్ల బాటా సంస్థలో ఒక భారతీయుడు సీఈవోగా బాధ్యతలు తీసుకోవడం ఇదే మొదటిసారి. ఐఐటీ ఢిల్లీ, ఎక్స్ఎల్ఆర్ఐ జంషేడ్‌పూర్‌లో చదువుకున్నారు. ఎక్స్ఎల్ఆర్ఐలో 1993 పీజీడీబీఎం బ్యాచ్‌ గోల్డ్ మెడలిస్టు.

సుందర్ పిచై:
గత దశాబ్ద కాలంలో భారత్ చూసిన అద్భుత విజయగాధ సుదర్ పిచైది. ఆల్ఫబేట్ కంపెనీకి ఆయన సీఈవోగా ఎంపికయ్యారు. ఆ తర్వాత 2015లో గూగుల్ సీఈవోగానూ బాధ్యతలు తీసుకున్నారు.

సత్య నాదెళ్ల:
హైదరాబాద్‌లో జన్మించిన సత్య నాదెళ్లకు 54 ఏళ్లు. 2014 ఫిబ్రవరిలో మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఆయన పేరు ప్రకటించారు. 2021 జూన్‌లో కంపెనీ చైర్మన్‌గా నియమించారు. అదనంగా ఇచ్చిన ఈ టాస్కులో పనికి నాయకత్వం వహిస్తూ బోర్డులో అజెండా సెట్ చేయాలి.

శాంతాను నారాయణ్:

అడాబ్ సిస్టమ్స్ సీఈవోగా నారాయణ్ ఉన్నారు. ఆయనే 1998లో కంపెనీలో చేరారు. 2007లో ఆయనను ఈ టాప్ పోస్టుకు ఎంపిక చేశాు.

అరవింద్ క్రిష్ణ:
ఈయన ఏప్రిల్ 2020 నుంచి ఐబీఎం సీఈవోగా ఉన్నారు. ఐబీఎం డైరెక్టర్ల బోర్డులో ఆయనకు చైర్మన్‌గా అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఐబీఎం ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌ వర్జీనియ ఎం రోమెట్టి తర్వాత అరవింద్ క్రిష్ణ బాధ్యతలు తీసుకున్నారు. 

రంగరాజన్ రఘురామ్:
2021 జూన్‌లో వీఎంవేర్ సీఈవోగా రంగరాజన్ రఘురామ్ బాధ్యతలు తీసుకున్నారు. అంతకుముందు ఈ కంపెనీలో ప్రాడక్ట్స్, క్లైడింగ్ సర్వీసెస్ సేవలు అందిస్తూ చీప్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పని చేశారు.

జార్జ్ కురియన్:
స్టోరేజ్ అడ్ డేటా మేనేజ్‌మెంట్ కంపెనీ నెట్ యాప్‌లో 2015 నుంచి జార్జ్ కురియన్ సీఈవోగా చేస్తున్నారు. అంతేకాదు, ప్రాడక్ట్స్ ఆఫరేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా కూడా చేశాడు.

నికేశ్ అరోరా: 
అరోరా 2018 జూన్‌లో పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌లో సీఈవోగా చేరాడు. అంతకు ముందు ఈయన సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ కార్ప్‌లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పని చేశాడు.

click me!