మారటోరియం ప్లాన్ పై కేంద్రానికి మరో 2 వారాల ఛాన్స్: సుప్రీంకోర్టు

By narsimha lodeFirst Published Sep 10, 2020, 1:36 PM IST
Highlights

:కరోనా వైరస్ సంక్షోభం సమయంలో అనుమతించిన రుణాలను తిరిగి చెల్లించడంపై తాత్కాలిక నిషేధాన్ని  ఉపయోగించి రుణ గ్రహీతలు తమ ఈఎంఐ భారాన్ని తగ్గించడానికి సహాయపడడానికి సుప్రీంకోర్టు ఈ రోజు ప్రభుత్వానికి మరో రెండు వారాలు సమయం ఇచ్చింది.


న్యూఢిల్లీ:కరోనా వైరస్ సంక్షోభం సమయంలో అనుమతించిన రుణాలను తిరిగి చెల్లించడంపై తాత్కాలిక నిషేధాన్ని  ఉపయోగించి రుణ గ్రహీతలు తమ ఈఎంఐ భారాన్ని తగ్గించడానికి సహాయపడడానికి సుప్రీంకోర్టు ఈ రోజు ప్రభుత్వానికి మరో రెండు వారాలు సమయం ఇచ్చింది.

రెండు వారాల్లో ఏమీ జరగబోతోంది. మేం కేంద్రానికి సమయం ఇస్తున్నామన్నారు.  ఉన్నత న్యాయస్థానం ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ప్రభుత్వానికి తెలిపింది.

కరోనా నేపథ్యంలో రుణాలు తీసుకొన్న వారి నుండి మారటోరియం కాలంలో వాయిదా వేసిన ఈఎంఐలపై వడ్డీని మాఫీ చేయాలని కోరుతూ ఒక పిటిషన్ పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది.

రుణాలు తీసుకొన్నవారికి ఉపశమనం కోసం ప్రభుత్వం, బ్యాంకులు  ఇతర వాటాదారులతో సంప్రదింపులు జరుపుతున్నామని కేంద్ర ప్రభుత్వం తరపున న్యాయవాది సుప్రీంకోర్టుకు చెప్పారు. ఇప్పటికే రెండు మూడు దఫాలు సమావేశాలు జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

రుణగ్రహీతలకు సంక్షేమం పొడిగింపు డేటా ఆధారంగా జరుగుతుందని ఈ ఏడాది సెప్టెంబర్ చివరి వారంలో కేసును విచారించనున్న ఉన్నత న్యాయస్థానం తెలిపింది.

తాత్కాలిక నిషేధాన్ని పొందే రుణ గ్రహీతల రుణ ఖాతాలు, రుణాలు తిరిగి చెల్లించడంలో ఆలస్యమైతే తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు చెడ్డ రుణాలుగా ప్రకటించవద్దని సుప్రీంకోర్టు గత వారంలో తీర్పు ఇచ్చింది.

రుణ గ్రహీతలను రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. బ్యాంకులు వారిపై ఎటువంటి నిర్భంధాన్ని తీసుకోకూడదని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

ఈఎంఐలపై వడ్డీపై వడ్డీని మాఫీ చేయాలని కోరుతున్నారు. వాయిదాపడిన ఈఎంఐలపై వడ్డీని మాఫీ చేయడం ప్రాథమిక ఆర్ధిక నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటుందని షెడ్యూల్ ప్రకారం రుణాలు తిరిగి చెల్లించేవారికి అన్యాయమని కేంద్రం, ఆర్బీఐలు చెబుతున్నాయి.

కరోనా కారణంగా ఈ ఏడాది మార్చిలో రుణాలపై మూడు నెలల పాటు మారటోరియాన్ని విధించింది. ఆ తర్వాత మే మాసంలో ఆగష్టు 31 వరకు మారటోరియాన్ని పొడిగించిన విషయం తెలిసిందే.

click me!