Lakhimpur Kheri court: జర్నలిస్ట్ మహ్మద్ జుబేర్‌కు లఖింపూర్ ఖేరీ కోర్టు సమన్లు

Published : Jul 09, 2022, 05:13 PM IST
Lakhimpur Kheri court: జర్నలిస్ట్ మహ్మద్ జుబేర్‌కు లఖింపూర్ ఖేరీ కోర్టు సమన్లు

సారాంశం

journalist Mohammad Zubair: హిందూ మత గురువులపై అభ్యంతరకర వ్యాఖ్య‌ల‌తో కూడిన‌ ట్వీట్ చేశాడనే ఆరోప‌ణ‌ల‌తో ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు, జ‌ర్న‌లిస్టు మహ్మద్ జుబేర్‌పై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు.  

Alt News co-founder Mohammed Zubair: సీతాపూర్‌లో నమోదైన కేసుకు సంబంధించి మధ్యంతర బెయిల్ అందుకున్న కొద్దిసేపటికే, ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలోని కోర్టు శుక్రవారం ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్‌కు జూలై 11న తమ ముందు హాజరు కావాలని సమన్లు ​​జారీ చేసింది. వివ‌రాల్లోకెళ్తే..హిందూ మత గురువులపై అభ్యంతరకర వ్యాఖ్య‌ల‌తో కూడిన‌ ట్వీట్ చేశాడనే ఆరోప‌ణ‌ల‌తో ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు, జ‌ర్న‌లిస్టు మహ్మద్ జుబేర్‌పై ఉత్తరప్రదేశ్ పోలీసులు  కేసు నమోదు చేశారు.ఈ  కేసుపై విచార‌ణ జ‌రిపిన దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు.. ఉత్త‌ర‌ప్రేదేశ్ పోలీసులు న‌మోదుచేసిన కేసులో మహమ్మద్ జుబేర్ కు శుక్రవారం సుప్రీంకోర్టు ఐదు రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన మరో కేసుకు సంబంధించి జర్నలిస్టును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

లఖింపూర్ ఖేరీలో దావా సెప్టెంబర్‌లో దాఖలైంది. ఫిర్యాదు ప్రకారం.. ఆశిష్ కుమార్ కటియార్ అనే వ్యక్తి, జుబేర్ వివిధ వర్గాల మధ్య సంబంధాలను దెబ్బతీసే ప్రయత్నంలో ట్విట్టర్‌లో నకిలీ సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాడ‌ని పేర్కొన్నాడు. ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకు జుబేర్ పై  పోలీసులు భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 153A కింద కేసు న‌మోదుచేసి.. అరెస్టు చేశారు. ఈ కేసు సామాజిక తరగతుల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే విష‌యాల‌కు సంబంధించిన‌ది. లఖింపూర్ ఖేరీ పోలీసులు అతనిపై వారెంట్‌ను శుక్రవారం కోర్టు నుండి అభ్యర్థించారు. జుబేర్‌ను జూలై 11న కోర్టుకు హాజరు కావాలని లఖింపూర్ ఖేరీ కోర్టు ఆదేశించినట్లు పోలీసు సూపరింటెండెంట్ సంజీవ్ సుమన్ తెలిపారు. పోలీసులు వారెంట్ జారీ చేసిన సీతాపూర్ జిల్లా జైలులో ఆయ‌న‌ను ఉంచారు.

ముగ్గురు హిందుత్వ మ‌త‌ గురువుల‌ను  ద్వేషపూరితంగా పేర్కొంటూ సీతాపూర్‌లో దాఖలు చేసిన ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్)ను తిరస్కరించడానికి అలహాబాద్ హైకోర్టు గత నెలలో నిరాకరించిన తర్వాత.. జ‌ర్న‌లిస్టు జుబేర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముగ్గురు దర్శకులు యతి నరసింహానంద సరస్వతి, బజరంగ్ ముని, ఆనంద్ స్వరూప్‌లపై ఇటీవల ముస్లింలకు సంబంధించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ద్వేషపూరిత ప్రసంగ నేరాల కింద అభియోగాలు మోపారు. సుప్రీంకోర్టు విచారణలో జుబైర్ తరపున సీనియర్ న్యాయవాది కొలిన్ గోన్సాల్వేస్ వాదిస్తూ, తన క్లయింట్ తాను ఎలాంటి ద్వేషపూరిత ప్రసంగం చేయలేదని పేర్కొన్నారు. 

విచారణ అధికారి తరపున వాదిస్తున్న అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు ప్రకారం జుబేర్ చేసిన ట్వీట్ మత సమూహాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేసింద‌న్నారు. హిందుత్వ మ‌త గురువుల గురించి ట్వీట్ చేయడం కంటే, జర్నలిస్ట్ ఉత్తరప్రదేశ్ పోలీసులకు లేఖ రాసి ఉండాల్సిందని ఆయన పేర్కొన్నారు.

 

కాగా, జుబేర్ చేసిన పోస్టులు ఏడాది క్రితంకు చెందినవి కావడం గమనార్హం.  

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌