మంత్రగత్తె అనే నెపంతో మహిళను వివస్త్రను చేసి, ఊరేగించి.. సోషల్ మీడియాలో వైరల్..

Published : Apr 19, 2022, 11:31 AM IST
మంత్రగత్తె అనే నెపంతో మహిళను వివస్త్రను చేసి, ఊరేగించి.. సోషల్ మీడియాలో వైరల్..

సారాంశం

మహారాష్ట్రలో దారుణం జరిగింది. మంత్రగత్తె అనే అనుమానంతో ఓ మహిళ మీద అమానవీయంగా ప్రవర్తించారు. ఆమెను వివస్త్రను చేసి, వీధుల్లో ఊరేగించారు. దీన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. 

ముంబై : witch అనే అనుమానంతో ఓ మహిళను వివస్త్రను చేసి ఊరేగించిన వీడియో social mediaలో వైరల్ గా మారింది.  Maharashtraలోని నందుర్బార్ జిల్లాలో ఓ మహిళ మంత్రగత్తె అనే అనుమానంతో స్థానిక ప్రజలు ఆమెను వివస్త్రను చేసి ఊరేగించారు. ఈ ఘటనను కొందరు కెమెరాలో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన్ సమితి ఈ ఘటనపై విచారణ జరపాల్సిందిగా నందుర్బార్ లోని జిల్లా అధికార యంత్రాంగాన్ని అభ్యర్థించింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర, కేంద్ర మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన్ సమితి ప్రతినిధి తెలిపారు. 

ఇదిలా ఉండగా, నిరుడు నవంబర్ 5న ఇలాంటి ఘటనే రాజస్తాన్ లో జరిగింది. ఆమెకు సుమారు 50 ఏళ్లు. పెళ్లీడుకొచ్చిన కూతురు కూడా ఉంది. ఈ క్రమంలోనే ఆమె భర్తను కోల్పోయింది. దీంతో అత్తవారి ఇంట్లోనే కన్నకూతుర్ని చదివించుకుంటూ కాలం వెల్లదీస్తోంది. ఈ క్రమంలో ఆమెకు ఓ షాకింగ్ విషయం తెలిసింది. కోడలు, మనవరాలు అని కూడా చూడకుండా తన మామ తమ మీద దారుణానికి పాల్పడినట్లు తెలుసుకుని షాక్ అయింది. ఆ తర్వాత ఆమె ఓ కీలక నిర్ణయం తీసుకుంది.  ఇంతకు ఏం జరిగింది అనేది పూర్తి వివరాలలోకి వెలితే.…

రాజస్థాన్లోని జైపూర్కు చెందిన ఓ మహిళ  కొన్నేళ్ళ క్రితం ఓ వ్యక్తిని పెళ్లాడింది.  వారికి ఓ అమ్మాయి కూడా జన్మించింది.  కూతురుకు  పెళ్లీడు వయసు వచ్చిన తర్వాత..  తాజాగా  husband కన్నుమూశాడు. దీంతో ఒంటరైన ఆమె..  కూతురును చూసుకుంటూ అత్తవారింట్లోనే ఉంటుంది.  భర్త దూరమైన విషయాన్ని ఇంకా జీర్ణించుకోకముందే మామ నుంచి ఆమెకు Harassment మొదలయ్యాయి.

‘నువ్వు  మంత్రగత్తెవు.. ఇంటి నుంచి వెళ్ళిపో’ అని ఆమెను ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేసాడు. అయితే దానికి ఒప్పుకోకపోవడంతో అతడు మరింత రెచ్చిపోయాడు. తాజాగా ఓ పిడుగులాంటి వార్త ఆమె చెవిన వేశాడు.  నువ్వు, నీ కూతురు స్నానం చేస్తుంటే  రహస్యంగా వీడియో తీశాను.  నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతే వాటిని social mediaలో పెడతాను అంటూ ఆమెను బెదిరించాడు.  

దీంతో ఆమె తన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక కన్నీరుమున్నీరయింది చివరికి పోలీసులను ఆశ్రయించింది. అత్తవారింట్లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పోలీసులకు వివరించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం