జాలీకి ఆడపిల్లలంటే ద్వేషమా: కొద్దిలో మిస్సయిన ఇద్దరు చిన్నారులు

By Siva KodatiFirst Published Oct 9, 2019, 6:52 PM IST
Highlights

జాలీకి ఆడపిల్లలంటే అస్సలు పడదని.. ఆ ద్వేషంతోనే మొదటి భర్త రాయ్ థామస్ సోదరి కుమార్తె ఆల్ఫైన్‌ను హతమార్చిందని సిట్ తెలిపింది. మొత్తం ఆరుగురు కుటుంబసభ్యుల్ని చంపిన ఆమె.. మరో ఇద్దరు చిన్నారులను సైతం చంపేందుకు కుట్ర పన్నినట్లుగా తెలుస్తోంది

కేరళలో సంచలనం కలిగించిన 6 వరుస హత్యల ఘటనలో ప్రధాన నిందితురాలు జాలీ గురించి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)నివ్వెరపోయే నిజాలను వెల్లడించింది.

జాలీకి ఆడపిల్లలంటే అస్సలు పడదని.. ఆ ద్వేషంతోనే మొదటి భర్త రాయ్ థామస్ సోదరి కుమార్తె ఆల్ఫైన్‌ను హతమార్చిందని సిట్ తెలిపింది. మొత్తం ఆరుగురు కుటుంబసభ్యుల్ని చంపిన ఆమె.. మరో ఇద్దరు చిన్నారులను సైతం చంపేందుకు కుట్ర పన్నినట్లుగా తెలుస్తోంది.

వరుస హత్యల కేసుపై విచారణ చేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ కుమార్తె‌ను సైనేడ్ ద్వారా అంతమొందించాలని ప్రయత్నించినట్లు ప్రత్యక దర్యాప్తు బృందం విచారణలో తేలింది. 

మరోవైపు జాలీలో సైకో లక్షణాలు ఉన్నాయని.. ఆమె స్ల్పిట్ పర్సనాలిటీ డిజార్డర్ అనే వ్యాధితో బాధపడుతూ ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

విషం పెట్టి ఆరుగురు కుటుంబసభ్యుల్ని చంపిందని ఆధారాలు చెబుతున్నప్పటికీ.. ఆమె స్నేహితులు, బంధువులు మాత్రం జాలీ అమాయకురాలని అంటున్నారు. విచారణ సరైన కోణంలో కొనసాగాలంటే సైకాలజిస్ట్‌ల సాయం తీసుకోవాలని కేరళ డీజీపీ లోక్‌నాథ్ బెహ్రా భావిస్తున్నారు. 

click me!