ఇప్పుడు Koo యాప్ వినియోగదారులు ChatGPT సహాయంతో పోస్ట్‌లను వ్రాయవచ్చు. ChatGPT ద్వారా పోస్ట్‌లను వ్రాయడానికి అనుమతించే ప్రపంచంలోనే మొట్టమొదటి మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ Koo యాప్ అని కంపెనీ పేర్కొంది.
ChatGPT గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలిచిన హాట్ టాపిక్. టెక్నాలజీ రంగంలో చాట్ జీపీటీ ఓ సంచలనంగా మారింది. ప్రస్తుతం ప్రపంచమంతా ఈ ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్(AI)పై చర్చ నడుస్తోంది. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే.. ఎన్ని లాభాలున్నాయో..? అంతకు మించి అనార్థాలు ఉన్నాయని, భారీ స్థాయిలో ఉద్యోగాల కోత పడుతుందనే ఆందోళన కూడా చాలామందిలో ఉంది.
ఇదిలాఉంటే.. Twitter ప్రత్యర్థి,భారతదేశం యొక్క మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ Koo యాప్ టెక్నాలజీ రంగంలో కీలక పరిణామానికి తెర తీసింది. ఇక నుంచి కూ యాప్ సృష్టికర్తలు( వినియోగదారులు) ChatGPT ద్వారా పోస్ట్‌లను చేయవచ్చని, ChatGPT అనుసంధానంతో కొత్త ఫీచర్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ ఫీచర్ Koo యాప్‌లో ధృవీకరించబడిన ప్రొఫైల్‌ల కోసం అందుబాటులో ఉంచబడింది. త్వరలో వినియోగదారులందరికీ అందుబాటులోకి తీసుకురాబడుతుంది.
undefined
ఈ ఫీచర్ గురించి తెలుసుకుందాం.
Koo యాప్ లో ChatGPTని జోడించడం ద్వారా.. వినియోగదారులు(క్రియేటర్‌లు) తమ కు పోస్ట్‌లను సిద్ధం చేయడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సామర్థ్యాలను ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఈ ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్(AI) ఫీచర్ క్రియేటర్‌లకు ఆనాటి అగ్ర వార్తా కథనాలను కనుగొనడం లేదా ప్రముఖ వ్యక్తుల గురించి తెలుసుకోవడం, నిర్దిష్ట అంశంపై పోస్ట్ లేదా బ్లాగ్ వ్రాయమని అడగడం వంటి అనేక మార్గాల్లో సహాయపడుతుందని కంపెనీ వెల్లడించింది. ఈ సబ్జెక్ట్‌లన్నింటికీ ఆదేశాలు ఇవ్వవచ్చని తెలిపింది.
ప్రశ్నలు అడగవచ్చు
Koo యాప్‌లో ChatGPT ని ఉపయోగించి క్రియేటర్‌లు వారి సందేశం లేదా ప్రశ్నను అడగవచ్చు లేదా టైప్ చేయగలమని వారి వాయిస్‌తో Koo యాప్ యొక్క వాయిస్ కమాండ్ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. ChatGPT ని అనుసంధానం చేయడంతో అనేక ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ఉచిత స్వీయ-ధృవీకరణ, Koo పోస్ట్‌ల కోసం టాక్-టు-టైప్, Kooని సవరించగల సామర్థ్యం , MLK ఫీచర్‌లు పేటెంట్ కోసం దాఖలు చేసిన ఒక పోస్ట్‌ను తక్షణమే బహుళ భాషల్లోకి అనువదించవచ్చు.
కూ యొక్క సహ వ్యవస్థాపకుడు మయాంక్ బిదవత్కా మాట్లాడుతూ.. కూ యాప్ ను ChatGPT అనుసంధానం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. కూ ఇన్నోవేషన్ ముందంజలో ఉంది. క్రియేటర్‌లు తమ భావాలను వ్యక్తీకరించడంలో, ప్లాట్‌ఫారమ్‌లో కమ్యూనిటీని నిర్మించడంలో సహాయం చేయడంపై దృష్టి కేంద్రీకరిస్తున్నారని పేర్కొన్నారు.
Koo ఇప్పటికే మైక్రోబ్లాగింగ్ 2.0 కోసం అనేక గ్లోబల్-ఫస్ట్ ఫీచర్లను ప్రారంభించింది, ఇందులో టాక్-టు-టైప్ ఫంక్షనాలిటీ ఫీచర్ అందుబాటు ఉందని తెలిపారు. ఎల్లప్పుడూ తాము కంటెంట్ సృష్టిని సులభతరం చేయడానికి మార్గాల కోసం వెతుకుతున్నామన్నారు. ChatGPTని జోడించడం వలన సృష్టికర్తలకు తక్షణ మేధోపరమైన సహాయం అందించబడుతుందని తెలిపారు.
కంటెంట్ సృష్టి ప్రవాహంలో భాగంగా ChatGPT అనుసంధానం చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ కూ నిలిచిందనీ, ChatGPT ద్వారా కూ అప్ ను ఉపయోగించే వివిధ మార్గాలను చూసి ఆశ్చర్యపోతారని ఆశిస్తున్నామని అన్నారు.