
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని కేంద్ర ప్రభుత్వం తొలగించింది. ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్‌కు అదనపు బాధ్యతలను అప్పగించింది. తమిళి సై సౌందర్ రాజన్ తెలంగాణ గవర్నర్‌గా ఉంటూ, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తారు.
పుదుచ్చేరిలో నెలరోజుల వ్యవధిలో అధికార కాంగ్రెస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో సీఎం నారాయణ స్వామి నేతృత్వంలోని ప్రభుత్వం మైనార్టీలో పడింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుంచి కిరణ్ బేడీని తొలగించి తమిళిసైకు బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశమైంది.