
ఉత్తరప్రదేశ్ లోని మథుర రైల్వే స్టేషన్‌లో చోరీకి గురైన 7 నెలల పసికందును ఓ బీజేపీ నేత ఇంటి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు 23వ తేదీన రాత్రి మథుర స్టేషన్‌లో తల్లిదండ్రులు నిద్రిస్తున్న సమయంలో, వారి పక్కనే ఉన్న ఎవరో ఒక వ్యక్తి ఆ బిడ్డను దొంగిలించారు. బాలుడిని కిడ్నాప్ చేయడం మొత్తం కెమెరాకు చిక్కింది. దీంతో ఈ వీడియో మొత్తం పెద్ద ఎత్తున్న వైరల్ గా మారి వార్తల్లో నిలిచింది. అయితే ఇప్పుడు ఆ పసికందు మథురకు 100 కిలోమీటర్ల దూరంలోని ఓ బీజేపీ కౌన్సిలర్ ఇంట్లో దొరికింది.
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు: రేసులో శశిథరూర్
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వివరించారు. బీజేపీకి చెందిన వినీతా అగర్వాల్, ఆమె భర్త ఈ బిడ్డను ఇద్దరు వైద్యుల నుండి రూ. 1.8 లక్షలకు కొనుగోలు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి మహ్మద్ ముస్తాక్ తెలిపారు. ఆ దంపతులకు ఒక కూతురు ఉందని, వీరికి ఒక కుమారుడు కావాలని ఉందని చెప్పారు. అందుకే ఆ బాబును కొనుగోలు చేశారని పేర్కొన్నారు.కాగా ఈ కేసులో ఇప్పటి వరకు 8 మందిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.
జయలలిత మృతి విషయంలో శశికళ విచారణకు కమిషన్ సిఫార్సు.. స్టాలిన్ సర్కార్ ఏ నిర్ణయం తీసుకుందంటే..
ఇదిలా ఉండగా.. మధురలోని రైల్వే పోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆ పసికందును తల్లికి అప్పగించారు. పోలీసులకు పట్టుబడిన డాక్టర్ల నుంచి రూ. 500 నోట్ల కట్టలను మీడియాకు చూపించారు. డబ్బు కోసం అక్రమ రవాణా చేస్తున్న ముఠా ఈ కిడ్నాప్‌కు పాల్పడిందని సీనియర్ పోలీసులు పేర్కొన్నారు.
భర్తను వదిలి ప్రియుడితో లివ్ ఇన్ రిలేషన్ షిప్.. కానీ కొన్ని రోజులకే అనుమానస్సద స్థితిలో..
రైల్వే స్టేషన్ నుంచి దీప్ కుమార్ అనే వ్యక్తి చిన్నారిని ఎత్తుకెళ్లాడని పోలీసులు తెలిపారు. సమీపంలో ఉన్న హత్రాస్ జిల్లాలో ఆసుపత్రిని నడుపుతున్న ఇద్దరు డాక్టర్లతో కూడిన గ్యాంగ్ లో నిందితుడు సభ్యుడు అని పేర్కొన్నారు. ‘‘దీప్ కుమార్ అనే వ్యక్తి ఆ బాబును ఎత్తుకెళ్లాడని గుర్తించాం. పత్రాస్ జిల్లాలో హాస్పిటల్ నడుపుతున్న ఇద్దరు డాక్టర్ల తో ఉన్న ముఠాలో అతడు సభ్యుడిగా ఉన్నాడు. మరి కొందరు ఆరోగ్య కార్యకర్తలకు కూడా ఇందులో ప్రమేయం ఉంది. పిల్లాడు ఎవరి ఇంట్లో ఉన్నాడో మేము విచారించి కనుగొన్నాం. వారి ఇంటికి వెళ్లాం. తమకు ఒకే కుమార్తె ఉందని, అయితే కుమారుడు కావాలని మేము కోరుకుంటున్నాం. అందుకే బాబు కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నాం” అని పోలీసులు పేర్కొన్నారు. కాగా.. ఈ ఘటనలో అరెస్టయిన కౌన్సిలర్ ఈ విషయంపై స్పందించలేదు. అలాగే బీజేపీ కూడా దీనిపై వ్యాఖ్యానించలేదు.