కిడ్నాపైన 17 ఏళ్ల తరువాత లభించిన మహిళ ఆచూకీ : ఢిల్లీలో ఘటన

Published : May 26, 2023, 09:58 AM IST
కిడ్నాపైన 17 ఏళ్ల తరువాత లభించిన మహిళ ఆచూకీ : ఢిల్లీలో ఘటన

సారాంశం

17 సంవత్సరాల క్రితం కిడ్నాప్ చేయబడిన ఓ బాలికను పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఆమె వయసు 32 సంవత్సరాలు. ఢిల్లీలోని గోకల్‌పురిలో ఉంటోంది. 

న్యూఢిల్లీ : 17 ఏళ్ల క్రితం 2006లో కిడ్నాప్‌కు గురైన 32 ఏళ్ల మహిళ ఢిల్లీలోని గోకల్‌పురిలో లభ్యమైనట్లు పోలీసులు గురువారం తెలిపారు. డీసీపీ షాహదారా రోహిత్ మీనా ప్రకారం, "మే 22 న, సీమాపురి పోలీస్ స్టేషన్ కు అందిన రహస్య సమాచారంతో.. పోలీసుల బృందం 17 సంవత్సరాల క్రితం కిడ్నాప్ చేయబడిన బాలిక... ప్రస్తుతం32 సంవత్సరాల వయసులో ఉన్న మహిళను గుర్తించింది"

2006లో ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఢిల్లీలోని గోకుల్‌పురి పోలీస్ స్టేషన్‌లో ఐపిసి సెక్షన్ 363 కింద కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. దీనిమీద పోలీసులు వివరాలు తెలుపుతూ.. "అమ్మాయిని 2006లో కిడ్నాప్ చేశారు. ఆమె విచారణలో, బాలిక తన ఇంట్లో నుంచి వెళ్లిన తర్వాత యూపీలోని చెర్డిహ్ జిల్లా బలియా గ్రామంలో దీపక్ అనే వ్యక్తితో కలిసి నివసిస్తున్నట్లు వెల్లడించింది. ఆ తర్వాత కొన్ని వివాదాల కారణంగా లాక్డౌన్ సమయంలో దీపక్‌ను వదిలిపెట్టి గోకల్‌పురిలో ఓ అద్దె ఇంట్లో నివసించడం ప్రారంభించింది" అని పోలీసులు తెలిపారు.

సీబీఐ కొత్త డైరెక్టర్ ప్రవీణ్ సూద్ కు మయాంక్ అగర్వాల్ ఉన్న రిలేషన్ ఇదే...

డీసీపీ షాహదారా రోహిత్ మీనా ప్రకారం, 116 మంది కిడ్నాప్/అపహరణకు గురైన పిల్లలు/వ్యక్తులు, 301 మంది తప్పిపోయిన వ్యక్తులను  2023 ఇప్పటి వరకు షాహదారా జిల్లా పోలీసులు కనిపెట్టారని తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Ahmedabad International Kite Festival సంక్రాంతి సంబరాల్లో పతంగ్ లు ఎగరేసిన మోదీ| Asianet News Telugu
Digital Health : ఇక వైద్యరంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ... కీలక పరిణామాలు