యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షోలో సరికొత్త ఫ్యాషన్ షో ... కేంద్ర మంత్రి ప్రశంసలు

By Arun Kumar P  |  First Published Sep 28, 2024, 12:22 PM IST

యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షోలో ఖాదీ ఫ్యాషన్ షో అందరినీ ఆకట్టుకుంది.  కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ రాష్ట్ర ప్రభుత్వ కృషిని ప్రశంసించారు,  


గ్రేటర్ నోయిడా : యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షోలో భాగంగా శుక్రవారం నిర్వహించిన ఖాదీ ఫ్యాషన్ షో యూపీ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించింది. ప్రజలు రాష్ట్ర సంస్కృతిని చూసి ముగ్ధులయ్యారు. అద్భుతమైన చీరల నుండి ఇతర దుస్తుల వరకు అన్నీ అక్కడి ప్రజలను ఎంతగానో ఆకర్షించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర జౌళి మంత్రి గిరిరాజ్ సింగ్ రాష్ట్ర ప్రభుత్వం ఖాదీని ప్రోత్సహించేందుకు చేస్తున్న కృషిని ప్రశంసించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ '5 ఎఫ్' (ఫామ్,ఫైబర్, ఫ్యాబ్రిక్, ఫ్యాషన్, ఫారిన్) దార్శనికతలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. లక్నో, ఉన్నావోలలో పీఎం మిత్ర పార్కుల అభివృద్ధి వస్త్ర రంగానికి ఊతమిస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

Latest Videos

అపెరల్ పార్క్ ద్వారా ఉపాధి అవకాశాలు

నోయిడా అపెరల్ ఎక్స్‌పోర్ట్ క్లస్టర్ (NAEC) ఆధ్వర్యంలో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై రూ.10,000 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న అపెరల్ పార్క్ రానున్న 2-3 సంవత్సరాలలో అపారమైన ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని గిరిరాజ్ సింగ్ తెలిపారు. ఇది ఆర్థిక, సామాజిక రంగాలలో మహిళా సాధికారతకు దోహదపడుతుందని అన్నారు.

 కేంద్ర మంత్రి ఇంటర్నేషనల్ ట్రేడ్ షోలోని వివిధ పెవిలియన్‌లను సందర్శించారు. వాటి అలంకరణ, ప్రదర్శనలో ఉన్న ఉత్పత్తులు, పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. అత్యుత్తమ పెవిలియన్‌ను ఎంపిక చేసి ప్రశంసా పత్రం అందజేశారు.

ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా యూపీ

"ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధనకు నిధుల సమీకరణ" అనే అంశంపై ఆర్థిక, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సురేష్ కుమార్ ఖన్నా సమావేశం నిర్వహించారు. రాష్ట్రాన్ని ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యసాధనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. వ్యూహాత్మక పెట్టుబడులు, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం, ఆర్థిక సమ్మిళితం వంటి అంశాలు అభివృద్ధిని వేగవంతం చేయడంలో, ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. లేజర్ షోతో ముగిసిన ఈ కార్యక్రమంలో ఇండియన్ ఐడల్ గాయకులు పవన్‌దీప్, అరుణితలు తమ గీతాలతో అందరినీ అలరించారు.

click me!