మసీదులో హిందూ పెళ్లి.. ఫోటోలు వైరల్

By telugu teamFirst Published Jan 21, 2020, 7:44 AM IST
Highlights

ఈ పెళ్లికి వారి బంధుమిత్రులతో పాటు మసీదు పెద్దలు హాజరవడం విశేషం. పెళ్లి అనంతరం శాకాహార విందు సైతం ఏర్పాటు చేశారు. పేద కుటుంబానికి చెందిన పెళ్లి కూతురి తల్లి మసీదు పెద్దల సహాయం అర్థించడంతో ఈ పెళ్లి సాకారమైంది. పెళ్లికి మసీదు పెద్దలు 10 సవర్ల బంగారంతో పాటు రెండు లక్షల కట్నం కూడా ఇచ్చారు.

మతసామర్యానికి ప్రతీక ఈ పెళ్లి.  మసీదులో ఇద్దరు హిందువులు పెళ్లిచేసుకున్నారు. వీరి పెళ్లికి బందు మిత్రులతోపాటు చుట్టుపక్కల వారందరూ వచ్చి... నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కేరళలోని చెరువల్లి ముస్లిం జమాత్‌ మసీదులో ఆదివారం హిందూ పెళ్లి జరిగింది. మసీదు ఆవరణలో హిందూ పూజారి ఆధ్వర్యంలో అంజు, శరత్‌లు ఏకమయ్యారు. ఈ పెళ్లికి వారి బంధుమిత్రులతో పాటు మసీదు పెద్దలు హాజరవడం విశేషం. పెళ్లి అనంతరం శాకాహార విందు సైతం ఏర్పాటు చేశారు. పేద కుటుంబానికి చెందిన పెళ్లి కూతురి తల్లి మసీదు పెద్దల సహాయం అర్థించడంతో ఈ పెళ్లి సాకారమైంది. పెళ్లికి మసీదు పెద్దలు 10 సవర్ల బంగారంతో పాటు రెండు లక్షల కట్నం కూడా ఇచ్చారు.

Also Read సిగరెట్ తాగుతూ నిద్రపోయాడు, సజీవదహనం...

1000 మందికి భోజనాలు ఏర్పాటు చేసినట్లు మసీదు కమిటీ కార్యదర్శి నుజుముదీన్‌ అలుమ్మూట్టిల్‌ చెప్పారు. ఈ పెళ్లిపై ఫేస్‌బుక్‌ వేదికగా కేరళ సీఎం పినరయి విజయన్‌ స్పందించారు. రాష్ట్రంలో మత సామరస్యానికి గుర్తుగా ఈ పెళ్లి నిలుస్తోందన్నారు. సీఏఏ, ఎన్నార్సీల పేరుతో దేశమంతా నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ ఈ పెళ్లి ఆదర్శనీయమైనదని చెప్పారు.

click me!