వామ్మో.. 10ఏళ్లు గర్ల్‌ఫ్రెండ్‌ను ఇంట్లోనే దాచాడు.. ఎట్టకేలకు వివాహం

Published : Sep 17, 2021, 03:30 PM IST
వామ్మో.. 10ఏళ్లు గర్ల్‌ఫ్రెండ్‌ను ఇంట్లోనే దాచాడు.. ఎట్టకేలకు వివాహం

సారాంశం

ఓ వ్యక్తి తాను ప్రేమించిన యువతిని పదేళ్లుగా సొంతింటిలోనే ఎవరికీ తెలియకుండా దాచిపెట్టారు. ఈ విషయం ఇటీవలే వెల్లడవడంతో కుటుంబ సభ్యులు సహా అందరూ నోరెళ్లబెట్టారు. తాజాగా, ఆ జంట ఓ రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి చేసుకున్నారు.

తిరువనంతపురం: తన కుటుంబానికి ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. దీంతో ఆమెను కుటుంబసమేతంగా ఉంటున్న ఇంటిలోనే ఎవరికీ కనిపించకుండా రహస్యంగా దాచి ఉంచాడు. ఒకట్రెండు రోజులు కాదండీ.. పదేళ్లు గదిలో దాచాడు. ఇటీవలే ఈ విషయం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అదే జంట తాజాగా ఆ జంట పెళ్లి చేసుకుంది. ఈ వేడుకకు ఆయన కుటుంబ సభ్యులు రానప్పటికీ ఆమె కుటుంబీకులు హాజరై ఆశీర్వదించారు.

నెన్మరకు చెందిన రహమాన్, అదే పట్టణానికి చెందిన సాజిత ప్రేమించుకున్నారు. కానీ, ఆమె అంటే రహమాన్ కుటుంబానికి ఇష్టం లేదు. దీంతో 11ఏళ్ల కింద సాజిత బంధువుల ఇంటికి బయల్దేరి మళ్లీ ఇల్లు చేరలేదు. మిస్సింగ్ కేసు నమోదు చేసినప్పటికీ బహుశా ఆమె ఓ యువకుడితో కలిసి తమిళనాడుకు
పారిపోయి ఉంటుందని పోలీసులూ ఊరుకున్నారు. కానీ, ఆమె ఇంటికి 100 మీటర్ల దూరంలోని ఇంటిలోనే రహమాన్ ఆమెను రహస్యంగా దాచి ఉంచారు. పదేళ్లు వారి కుటుంబ సభ్యులకూ ఆ విషయం తెలియదు. ఈ కాలంలో ఆమె ఆ ఒక్క గదికే పరిమితమైనా రాత్రిళ్లు కిటికీ ద్వారా బయటకు వచ్చేదని, అది కూడా కొంత సేపే బయట ఉండి తిరిగి లోపటికి వెళ్లేది.

ఈ ఏడాదే సాజిత విషయం బయటికి తెలిసింది. కానీ, వారి కుటుంబాలు వివాహానికి అంగీకరించకపోవడంతో రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి చేసుకున్నారు. నెన్మరలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వివాహం చేసుకున్నారు. ఈ వివాహ కార్యక్రమానికి సాజిత కుటుంబీకులు వచ్చారు. కానీ, రహమాన్ కుటుంబీకులు హాజరవ్వలేదు. స్థానిక ఎమ్మెల్యే కే బాబు కూడా పూవులు అందించి వారికి పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

PM Modi Performs Yoga: ఢిల్లీ లోని ఎర్రకోట ప్రాంగణంలో యోగా ఆసనాలు వేసిన మోదీ | Asianet News Telugu
Nirmala Sitharaman: యోగాలో పాల్గొన్న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ | Asianet News Telugu