మైనర్ బాలికపై 90 ఏళ్ల వృద్ధుడి లైంగిక దాడి.. మూడేండ్ల జైలు శిక్ష 

By Rajesh KFirst Published Sep 1, 2022, 1:49 PM IST
Highlights

మైన‌ర్ బాలిక‌ను లైంగిక దాడికి పాల్ప‌డిన‌  కేసులో కేర‌ళ కోర్టు 90 ఏళ్ల వృద్ధుడికి మూడేళ్ల జైలుశిక్ష విధించింది. పాలక్కాడ్ జిల్లాలోని క‌రింబా గ్రామంలో ఆ వృద్ధుడు మైన‌ర్‌పై దాడికి పాల్ప‌డ్డాడు. 

మ‌హిళ‌లు, చిన్నారుల ర‌క్ష‌ణ కోసం ప్ర‌భుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా.. రోజురోజుకు  అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. కామాంధుల‌ను దారుణమైన శిక్షలు విధించిన వారి తీరులో ఏలాంటి  మార్పు రావడంలేదు. చిన్నాపెద్దా అన్న తేడా లేదు.. ఆడపిల్ల అయితే చాలనుకుని.. కొంద‌రు కామ పిశ‌సుల్లా మీదపడిపోతున్నారు. తాజాగా  కేర‌ళ‌లో మైనర్ బాలిక(15)పై  90 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన ఘ‌ట‌న‌లో కేరళ కోర్టు సంచ‌ల‌న తీర్పును వెలువ‌ర్చింది. ఆ వృద్ధ కామాంధుడికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 

వివరాల్లోకెళ్తే.. కేర‌ళ‌లోని పాలక్కాడ్ జిల్లా కరీంబా గ్రామంలో ఓ వృద్దుడు తన పొరుగున ఉన్న 15 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌ 2020లో చోటు చేసుకుంది. దీంతో బాధితురాలి కుటుంబం కోర్టును ఆశ్ర‌యించింది. ఈ కేసు విచార‌ణ‌ను ఫాస్ట్ ట్రాక్ స్పెష‌ల్ కోర్టు చేపట్టింది. ఇరువైపుల వాదాలు, సాక్ష్యుల్ని ప్ర‌శ్నించిన త‌రువాత‌.. జ‌డ్జి స‌తీశ్ కుమార్ ఈ కేసులో తీర్పునిస్తూ ఆ వృద్ధుడికి 
మూడేళ్ల జైలు శిక్షతో పాటు.. 50 వేల జ‌రిమానా విధించారు.
 
ఈ ఉత్తర్వును స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నిషా విజయకుమార్ ధృవీకరించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..  లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం లైంగిక వేధింపుల నేరానికి వ్యక్తి దోషిగా నిర్ధారించి.. శిక్ష వేసిన‌ట్టు తెలిపారు. పోక్సో చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం నేరానికి కనీసం మూడేళ్ల జైలు శిక్ష నుంచి గరిష్టంగా 5 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుందని తెలిపారు. ఈ కేసులో సుమారు 9 మంది సాక్ష్యుల్ని విచారించిన త‌ర్వాత.. ఆ వృద్దుడు లైంగిక దాడికి పాల్ప‌డిన‌ట్టు నిర్ధార‌ణ‌కు వ‌చ్చిన‌ట్టు తెలిపారు.

click me!