అధికారంలోకి వస్తే లవ్ జిహాద్‌కి వ్యతిరేకంగా చట్టం: బీజేపీ నేత సురేంద్రన్

Published : Feb 08, 2021, 09:12 PM IST
అధికారంలోకి వస్తే లవ్ జిహాద్‌కి వ్యతిరేకంగా చట్టం: బీజేపీ నేత సురేంద్రన్

సారాంశం

: తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కేరళ రాష్ట్రంలో లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా చట్టాలు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ తెలిపారు.

తిరువనంతపురం: తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కేరళ రాష్ట్రంలో లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా చట్టాలు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ తెలిపారు.ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తెచ్చినట్టుగా యాంటీ లవ్ జిహాద్ చట్టాన్ని తెస్తామన్నారు.  సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రస్తుతం లవ్ జీహాద్ ఓ పెద్ద తలనొప్పిగా మారిందన్నారు. హిందూ ధార్మిక సంస్థలు మాత్రమే కాదు క్రిస్టియన్ సంస్థలు, చర్చిలు కూడా లవ్ జీహాద్ కు వ్యతిరేకంగా చట్టాలు తేవాలని డిమాండ్ చేస్తున్నాయని ఆయన గుర్తు చేశారు.

తమ ఎన్నికల మేనిఫెస్టోలో యాంటీ లవ్ జీహాద్ చట్టాన్ని రూపొందిస్తామన్నారు. త్వరలోనే కేరళలో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. 

కేరళ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ అన్ని రకాల ప్రయత్నాలను చేస్తోంది. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటమితో పాటు తాము కూడ ప్రధాన పోటీని ఇస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు,. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎల్డీఎఫ్ అధిక స్థానాల్లో విజయం సాధించింది. 
 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌