సీనియర్ సిటిజన్లకు రైళ్లలో మినహాయింపు ఇవ్వండి.. ప్రధాని మోదీకి కేజ్రీవాల్‌ లేఖ

Published : Apr 04, 2023, 04:04 AM IST
 సీనియర్ సిటిజన్లకు రైళ్లలో మినహాయింపు ఇవ్వండి.. ప్రధాని మోదీకి కేజ్రీవాల్‌ లేఖ

సారాంశం

రైలు ప్రయాణంలో వృద్ధులకు ఇస్తున్న మినహాయింపును పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ఏడాదిలో రూ.45 లక్షల కోట్లు ఖర్చు చేస్తుందని, రైలు ప్రయాణంలో రాయితీ రూ.1600 కోట్లు అని, ఇది సముద్రంలో చుక్కలాంటిదని అన్నారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈసారి రైలు ప్రయాణంలో వృద్ధుల మినహాయింపును పునరుద్ధరించాలని కోరారు. ఈ మినహాయింపును నిలిపివేయడం దురదృష్టకరమని ఆయన అన్నారు. గతంలో ఢిల్లీ బడ్జెట్‌పై సీఎం కేజ్రీవాల్‌ ప్రధాని మోదీకి లేఖ రాశారు.

అరవింద్ కేజ్రీవాల్ తన లేఖలో ఇలా వ్రాశారు.. "గత కొన్నేళ్లుగా దేశంలోని పెద్దలు రైలు ప్రయాణంలో 50 శాతం వరకు రాయితీ పొందుతున్నారు. దేశంలోని కోట్లాది మంది పెద్దలు దీని ప్రయోజనాన్ని పొందుతున్నారు. అయితే.. మీ ప్రభుత్వం ఈ మినహాయింపును రద్దు చేసింది. ఇది దురదృష్టకరం. ఇటీవల లోక్‌సభలో మీ ప్రభుత్వం రైలు ప్రయాణంలో వృద్ధులకు ఇస్తున్న రాయితీని నిలిపివేయడం ద్వారా ఏటా రూ.1600 కోట్లు ఆదా అవుతోందని చెప్పారు.

అయితే రూ.45 లక్షల కేంద్ర బడ్జెట్‌ లో ఈ రాయితీ .. సముద్రంలో ఒక చిన్న నీటి బిందువని ఆయన పేర్కొన్నారు. ఈ రాయితీని ఆపడానికి ద్రవ్య పరిమితులు కారణం కాకూడదని అన్నారు. ఢిల్లీ ప్రభుత్వం తన 70 వేల కోట్ల బడ్జెట్‌లో ఉచిత తీర్థ యాత్రల కోసం బడ్జెట్‌లో రూ.50 కోట్లను కేంద్రం కేటాయించడాన్ని ఆయన గుర్తు చేశారు. ఇది డబ్బుకు సంబంధించిన విషయం కాదని, ఉద్దేశంతో ఉందని కేజ్రీవాల్ అన్నారు.  

'ఆ రాయితీ మొత్తం సముద్రంలో చుక్కలా'

వచ్చే ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం 45 లక్షల కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టగా.. ఇందులో వృద్ధులకు రైలు ప్రయాణంలో మినహాయింపు కోసం కేవలం 1600 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తారు. ఈ మొత్తం సముద్రంలో చుక్కలాంటిది. ఖర్చు పెట్టకుండా కేంద్రప్రభుత్వం ధనవంతులు కాదనీ, ఖర్చుపెట్టడం వల్ల కేంద్రప్రభుత్వం దరిద్రం కాదనీ, ఆపితే మిమ్మల్ని పట్టించుకోవద్దనే రీతిలో సందేశం ఇస్తున్నామని అన్నారు.

ఇది చాలా తప్పు. భారతీయ సంస్కృతికి విరుద్ధం. అందుకే వృద్ధుల పట్ల సున్నితత్వం చూపాలని, వీలైనంత త్వరగా ఈ రాయితీని పునరుద్ధరించడానికి కృషి చేయాలని  అభ్యర్థిస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. ప్రధాని మోదీకి రాసిన ఈ లేఖను ట్విట్టర్‌లో సోమవారం పోస్ట్‌ చేశారు.

గతంలో 58 ఏళ్ళు పైబడిన మహిళలకు రైలు ప్రయాణంలో  50 శాతం, 60 ఏళ్లు పైబడిన పురుషులకు 40 శాతం రాయితీని రైల్వే శాఖ ఇచ్చేది. అయితే కరోనా నేపథ్యంలో 2020 మార్చి నుంచి సీనియర్ సిటిజన్‌లతో పాటు అన్ని వర్గాలకు రాయితీని రైల్వే మంత్రిత్వ శాఖ రద్దు చేసింది.

PREV
click me!

Recommended Stories

సంక్రాంతికి కిచిడీ మేళా.. ఈ ఆలయంలో విచిత్రమైన ఆచారం
Gold Rate : గూగుల్, న్యూస్ ధరలు కాదు.. రియల్ టైమ్ బంగారం రేటు కచ్చితంగా తెలుసుకోవడం ఎలాగంటే..