ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలి: కేసీఆర్

By narsimha lodeFirst Published Dec 23, 2018, 8:21 PM IST
Highlights

 ప్రాంతీయ పార్టీలు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని తెలంగాణ సీఎం కేసీఆర్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అభిప్రాయపడ్డారు.

భువనేశ్వర్: ప్రాంతీయ పార్టీలు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని తెలంగాణ సీఎం కేసీఆర్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అభిప్రాయపడ్డారు.

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్  తో ఆదివారం నాడు భువనేశ్వర్ లో చర్చించారు. విశాఖపట్నం నుండి ప్రత్యేక విమానంలో కేసీఆర్ దంపతులు ఒడిశాకు చేరుకొన్నారు.

ఆదివారం సాయంత్రం ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో కేసీఆర్ సుమారు గంటకు పైగా చర్చించారు. ఈ సమావేశం తర్వాత రెండు రాష్ట్రాల సీఎంలు సంయుక్తంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. 

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కు తమ మద్దతు ఉంటుందని రెండు రాష్ట్రా సీఎంలు ప్రకటించారు. ప్రాంతీయ పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని కేసీఆర్ చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చర్చలు ప్రారంభంలో ఉన్నాయని కేసీఆర్ చెప్పారు. దేశంలోని ఇంకా పలు పార్టీలతో చర్చిస్తున్నట్టు కేసీఆర్ తెలిపారు. మరోసారి నవీన్ పట్నాయక్ తో సమావేశం కానున్నట్టు ఆయన తెలిపారు.

భావసారూప్య పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలపై చర్చించామన్నారు. రేపు ఉదయం కేసీఆర్ దంపతులు కోణార్క్ సూర్యదేవాలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం పూట బెంగాల్ కు వెళ్తారు.


 

click me!